లోక్‌సభలో పౌరసత్వ బిల్లు ప్రతులను చించేసిన ఒవైసీ!
పార్లమెంటులో సోమవారం తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో పౌరసత్వ సవరణ బిల్లు ప్రతులను హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ చింపివేశారు. “ఇది దేశాన్ని విభజించే ప్రయత్నం. ప్రతిపాదిత చట్టం మన దేశ రాజ్యాంగానికి విరుద్ధం” అని ఎంఐఎం చీఫ్ ఒవైసీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. లోక్ సభలో ప్రసంగించిన ఒవైసీ “ఈ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధం…. దేశంలో ముస్లింలకు స్థానం లేకుండా చేయడానికి ఇది ఒక కుట్ర” అని పేర్కొన్నారు, ఇటువంటి చట్టాన్ని ఆమోదించడం వల్ల […]
పార్లమెంటులో సోమవారం తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో పౌరసత్వ సవరణ బిల్లు ప్రతులను హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ చింపివేశారు. “ఇది దేశాన్ని విభజించే ప్రయత్నం. ప్రతిపాదిత చట్టం మన దేశ రాజ్యాంగానికి విరుద్ధం” అని ఎంఐఎం చీఫ్ ఒవైసీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. లోక్ సభలో ప్రసంగించిన ఒవైసీ “ఈ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధం…. దేశంలో ముస్లింలకు స్థానం లేకుండా చేయడానికి ఇది ఒక కుట్ర” అని పేర్కొన్నారు, ఇటువంటి చట్టాన్ని ఆమోదించడం వల్ల 1947 విభజన పునరావృతమవుతుందని ఒవైసీ తెలిపారు.
ముస్లింలను అణగదొక్కటానికి ప్రయత్నించడం ద్వారా బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం దేశ స్వాతంత్య్ర సమరయోధులను అవమానించిందని ఓవైసీ ఆరోపించారు. “మీరు చైనాకు భయపడుతున్నారా?” అని అరుణాచల్ ప్రదేశ్లో పొరుగు దేశం ఆక్రమణకు సూచనగా ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. అయితే.. పౌరసత్వ బిల్లు ప్రతులను ఒవైసీ చించివేయడం పార్లమెంటుకే తీవ్ర అవమానమని అధికార పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.