Gold Scam: హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన రూ.300 కోట్ల భారీ గోల్డ్‌ స్కామ్‌… 1500 మందిని మోసం చేసిన ఇఫ్సర్ అరెస్ట్…

|

Jan 24, 2021 | 9:41 PM

Gold Scam In HYD: హైదరాబాద్‌లో మరో భారీ గోల్డ్‌ స్కాం వెలుగులోకి వచ్చింది. 2019లో చెన్నై కేంద్రంగా మొదలైన మోసానికి సంబంధించిన నిందితులను తాజాగా హైదరాబాద్‌ బీహెచ్‌ఈఎల్‌లో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే...

Gold Scam: హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన రూ.300 కోట్ల భారీ గోల్డ్‌ స్కామ్‌... 1500 మందిని మోసం చేసిన ఇఫ్సర్ అరెస్ట్...
Follow us on

Gold Scam In HYD: హైదరాబాద్‌లో మరో భారీ గోల్డ్‌ స్కాం వెలుగులోకి వచ్చింది. 2019లో చెన్నై కేంద్రంగా మొదలైన మోసానికి సంబంధించిన నిందితులను తాజాగా హైదరాబాద్‌ బీహెచ్‌ఈఎల్‌లో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన రూబీ గోల్డ్‌ వడ్డీలేని రుణాలు ఇస్తానని భారీగా ఆభరణాలు తీసుకుని దాదాపు 1500 మందిని మోసం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మొత్తం రూ.300 కోట్ల విలువైన వెయ్యి కిలోల బంగారాన్ని రూబీ గోల్డ్‌ యజమాని ఇఫ్సర్‌ రెహమాన్‌ సేకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

బంగారం విలువకు మూడొంతుల డబ్బు ఇస్తానని జనాలకు మాయమాటలు చెప్పి ఇతను నమ్మించాడు. దీంతో 1500 మంది తమ ఆభరణాలను రుణాల కోసం ఇచ్చారు. దీంతో వారందరీని మోసం చేస్తూ ఇఫ్సర్‌ అక్కడి నుంచి పరార్‌ అయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం నగరంలోని బీహెచ్‌ఈఎల్‌లోని ఓ ఇంట్లో తెలంగాణ, చెన్నై పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఇఫ్సర్‌తో పాటు ఆయన సోదరుడు.. మరో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే సోదాల్లో ఏదైనా బంగారం దొరికిందా, ఏయో ప్రాంతాల్లో ఇంకా సోదాలు నిర్వహిస్తారు లాంటి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Telangana CM Kcr: పీఆర్సీ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ఆదేశాలు.. వారం రోజుల్లోగా..