బిగ్ బ్రేకింగ్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమన్లు జారీ చేసిన ఈడీ కోర్టు
బిగ్ బ్రేకింగ్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీచేసింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని..
ED issues summons to AP CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టు సమన్లు జారీచేసింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని జగన్ కు ఈడీ కోర్టు ఆదేశాలిచ్చింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ ఇటీవల నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు, విజయసాయి రెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, అరబిందో ఎండీ నిత్యానంద రెడ్డి, పీవీ రాంప్రసాద్ రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యకు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.