AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhuma Akhila Priya Arrest Live: అఖిల ప్రియ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా..

Akhila Priya Arrest: బోయిన్‌ పల్లి కిడ్నాప్‌ వ్యవహారంలో మాజీ మంత్రి అఖిల ప్రియ బెయిల్‌ వ్యవహారంపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అఖిల ప్రియ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఇప్పటికే రెండు సార్లు కొట్టేసిన విషయం తెలిసిందే...

Bhuma Akhila Priya Arrest Live: అఖిల ప్రియ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా..
Narender Vaitla
|

Updated on: Jan 20, 2021 | 2:15 PM

Share

Bhuma Akhila Priya Arrest: బోయిన్‌ పల్లి కిడ్నాప్‌ వ్యవహారంలో మాజీ మంత్రి అఖిల ప్రియ బెయిల్‌ వ్యవహారంపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. తాజాగా బుధవారం బెయిల్‌ పిటిషన్‌పై సికింద్రబాద్‌ సెషన్‌ కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా.. కోర్టు విచారణను రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అఖిల ప్రియ బెయిల్‌ విషయంపై సస్పెన్స్‌ ఇంకా వీడలేదు. ఇదిలా ఉంటే.. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అఖిల ప్రియ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే రెండు సార్లు కొట్టేసిన విషయం తెలిసిందే. అఖిల ప్రియ బయటకొస్తే సాక్షులను బెదిరించవచ్చని పోలీసులు వేసిన పిటిషన్‌తో ఏకీభవించిన కోర్టు అఖిల ప్రియ బెయిల్‌కు నిరాకరించింది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Jan 2021 02:00 PM (IST)

    అఖిల ప్రియ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి  వాయిదా..

    బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమా అఖిల ప్రియ బెయిల్‌ పిటిషన్‌పై సెషన్స్‌ కోర్టు స్పందించింది. విచారణను రేపటికి వాయిదా వేస్తూ పోలీసులకు నోటీసులు జారీచేసింది.

  • 20 Jan 2021 01:59 PM (IST)

    ఇంకా పరారీలోనే నిందితులు.. అఖిల ప్రియ బెయిల్‌పై ఇది ప్రభావం చూపుతుందా..?

    బోయిన్‌పల్లి కిడ్నాప్‌కేసు సస్పెన్స్‌ సినిమాను తలపిస్తోంది. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో రసవత్తరంగా సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఏ1గా ఉన్న అఖిల ప్రియకు బెయిల్‌ నిరాకరించిన కోర్టు దానికి పరారీలో ఉన్న నిందితులను కారణంగా చూపింది. అయితే ఈ కిడ్నాప్‌ వ్యవహరంలో నిందితులుగా ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ్‌ రామ్‌, సోదరుడు జగత్‌ విఖ్యాత్‌తో పాటు మరో ఐదుగురు నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అఖిలకు ఇప్పుడు కూడా బెయిల్‌ సందేహమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

  • 20 Jan 2021 12:31 PM (IST)

    గతంలో అఖిల ప్రియ బెయిల్‌ నిరాకరణకు కారణాలివే…

    బోయిన్‌ పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే రెండు సార్లు కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ కిడ్నాప్‌ కేసులో అఖిల ప్రియ భర్త భార్గవ్‌ రామ్‌, సోదరుడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి పరారీలో ఉన్న నేపథ్యంలో బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశాలున్నాయని పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు అఖిల ప్రియ బెయిల్‌ రద్దు చేస్తూ సోమవారం తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే.

  • 20 Jan 2021 12:16 PM (IST)

    బోయిన్‌పల్లి కిడ్నాప్‌కు డిసెంబర్‌లోనే స్కెచ్‌ వేసిన అఖిల ప్రియ, ఆమె భర్త..

    రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ వ్యవహరంలో రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. ప్రవీణ్‌ రావు అతని సోదరులను కిడ్నాప్‌ చేయడానికి మాజీ మంత్రి అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్‌ రామ్‌ గతేడాది డిసెంబర్‌లోనే స్కెచ్‌ వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే కొన్ని కారణాల వల్ల కిడ్నాప్‌ వాయిదా పడింది.

  • 20 Jan 2021 11:40 AM (IST)

    కిడ్నాప్‌ కేసులో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోనున్న బోయిన్‌పల్లి పోలీసులు..

    విచారణ జరుగుతున్నకొద్దీ బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో రోజుకో కొత్త అంశం బయటకొస్తోంది. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను బోయిన్‌పల్లి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. వీరిలో అఖిల ప్రియ పర్సనల్‌ అసిస్టెంట్‌లు సంపత్‌, మల్లికార్జున్‌ రెడ్డి ఉన్నారు. వీరిద్దరినీ చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో విచారించనున్నారు.

  • 20 Jan 2021 11:07 AM (IST)

    ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేసిన అఖిల ప్రియ భర్త…

    ఓవైపు అఖిల ప్రియ బెయిల్‌ కేసు కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఆమె భర్త భార్గవ్‌ రామ్‌ ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. భార్గవ్‌ రామ్‌తో పాటు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి కూడా ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ వేశారు. ఇదిలా ఉంటే బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో నిందితుడిగా ఉన్న భార్గవ్‌ రామ్‌ ప్రస్తుతం ఆజ్ఙాతంలో ఉన్న విషయం తెలిసిందే.

  • 20 Jan 2021 10:53 AM (IST)

    అఖిల ప్రియ బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ…

    బోయిన్‌ పల్లి కిడ్నాప్‌ కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిల్‌ పిటిషన్‌పై సికింద్రబాద్‌ సెషన్‌ కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఇప్పటికే రెండుసార్లు బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఈసారైనా అఖిల ప్రియకు బెయిల్‌ లభిస్తుందా లేదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి కొద్ది సేపట్లో బెయిల్‌ పిటిషన్‌ కోర్టుకు ముందుకు రానుంది.

Published On - Jan 20,2021 2:00 PM