కరోనా కట్టడికోసం.. యాంటీబాడీస్ తయారీలో.. భారత్‌ బయోటెక్‌..

| Edited By:

May 08, 2020 | 5:10 PM

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి నియంత్రణకు.. మెడిసిన్‌కి సంబంధించి విశ్వవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్న నేపథ్యంలో యాంటీ బాడీల తయారీకి భారత్‌ బయోటెక్‌కు సీఎస్‌ఐఆర్‌ అనుమతినిచ్చింది.

కరోనా కట్టడికోసం.. యాంటీబాడీస్ తయారీలో.. భారత్‌ బయోటెక్‌..
Follow us on

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి నియంత్రణకు.. మెడిసిన్‌కి సంబంధించి విశ్వవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్న నేపథ్యంలో యాంటీ బాడీల తయారీకి భారత్‌ బయోటెక్‌కు సీఎస్‌ఐఆర్‌ అనుమతినిచ్చింది. ఎన్ఎంఐటిఎల్ఐ ప్రోగ్రాంలో భాగంగా కొవిద్ నియంత్రణకు ఉపయోగపడే.. మానవ మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ తయారీ ప్రాజెక్టును సీఎస్‌ఆర్‌ఐ భారత్‌ బయోటెక్‌కి అప్పగించింది.

మరోవైపు.. ఈ ప్రాజెక్టులో భాగంగా నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్‌, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండస్ట్రీ ప్రిడామిక్స్‌ టెక్నాలజీతో కలసి భారత్ బయో టెక్ పని చేయనుంది. ఈ మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ మానవ శరీరంలోని కరోనా వైరస్‌ను అత్యంత వేగంగా నియంత్రించగలవు.. ఫలితంగా వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడం సులభతరం కానుంది.

కాగా.. ప్రపంచ వ్యాప్తంగా కొవిద్ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్‌ కోసం ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్‌ కన్నా వేగంగా మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ ప్రభావవంతంగా పనిచేయగలవని భారత్‌ బయోటెక్‌ ఎండీ డాక్టర్‌ కృష్ణా ఎల్లా అభిప్రాయపడ్డారు.