AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final 2021: కోహ్లీ సేనకు ‘భారత ఆర్మీ’ సపోర్ట్.. ! స్టేడియంలో ఉత్సాహపరిచేందుకు రెడీ అంటూ వీడియో..

శుక్రవారం నుంచి సౌథాంప్టన్ వేదికగా ప్రారంభం కానున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌ సందర్భంగా టీమిండియాను ఉత్సాహపరిచేందుకు 'భారత ఆర్మీ' సిద్ధమైంది.

WTC Final 2021: కోహ్లీ సేనకు ‘భారత ఆర్మీ’ సపోర్ట్.. ! స్టేడియంలో ఉత్సాహపరిచేందుకు రెడీ అంటూ వీడియో..
Wtc Final 2021
Venkata Chari
|

Updated on: Jun 17, 2021 | 5:36 PM

Share

WTC Final 2021: భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో.. టీమిండియాని ఉత్సాహపరిచేందుకు ‘భారత ఆర్మీ’ రెడీ అయింది. సౌథాంప్టన్ వేదికగా రేపు మధ్యాహ్నం మ్యాచ్ మొదలవనుంది. ఈమేరకు స్టేడియంలోకి సుమారు 4,000 మందిని ఈసీబీ అనుమతించనుంది. ఈమేరకు భారత ఆర్మీ ఓ వీడియో ను విడుదల చేసింది. మ్యాచ్‌ ను ప్రత్యక్షంగా చూసేందుకు,  టీమిండియా ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు స్టేడియంలోకి వెళ్లనున్నట్లు భారత ఆర్మీ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఫైనల్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారనున్నట్లు తెలుస్తోంది. సౌథాంప్టన్‌లో వర్షం కురిసే సూచనలున్నాయి. కాగా, పిచ్ పేసర్లకి అనుకూలమనే వార్తల నేపథ్యంలో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగనుందని తెలుస్తోంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం టీమిండియా ఆటగాళ్లు ఈ నెల 3న సౌథాంప్టన్‌కి చేరుకున్నారు. అనంతరం రెండు టీంలుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్‌లో యువ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ శతకం నమోదు చేశాడు. శుభమన్ గిల్, రవీంద్ర జడేజా అర్థ సెంచరీలతో చెలరేగారు. ఇక బౌలింగ్‌లో ఇషాంత్ శర్మ 3 వికెట్లు తీశాడు. మరోవైపు ఇంగ్లాండ్‌‌తో జరిగిన రెండు టెస్టులు సిరీస్ ను కివీస్ 1-0తో గెలుచుకుంది.

Also Read:

WTC Finals: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. జట్టులో ఇద్దరు స్పిన్నర్లు.!

ICC Test Rankings: ర్యాంక్ మెరుగుపరుచుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..! ఏ ప్లేస్‌ లో ఉన్నాడంటే ..?

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్