Thieves Hulchul: విశాఖలో కొందరు గుర్తు తెలియని యువకులు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో చోరీకి విశ్వప్రయత్నం చేశారు. అందుకు వీలు చిక్కకపోవడంతో సైలెంట్‌గా వెళ్లిపోయారు. ఈ క్రమంలో సీసీ కెమెరాకు అడ్డంగా చిక్కారు. నగరంలోని మద్దిలపాలెంలో తాళం వేసిన ఓ ఇంట్లోకి కొందరు యువకులు చొరబడ్డారు. లోపలికి రాగానే.. ముందుగా సీసీ కెమెరా తొలగించాలని ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో కెమెరాకు చిక్కకుండా వెనక్కి నడుస్తూ పరారయ్యారు. కానీ మరోవైపు ఉన్న సీసీ కెమెరాను వారు గమనించకపోవడంతో.. అందులో దొంగల విజువల్స్ రికార్డయ్యాయి. ఈ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.
సంక్రాంత్రి పండుగ కావడంతో కొంతమంది నగరం నుంచి సొంత ఊళ్లకు వెళుతున్నారు. దీంతో దొంగలు ఇదే అదనుగా భావించి చోరీలకు ప్రయత్నిస్తున్నారు. పండుగకు ఎవరూ ఉండరని తెలిసి.. చోరీలు జరిగే అవకాశం ఉంటుందని ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. ఊళ్లకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read :
Nellore Tragedy: లవ్ మ్యారేజ్ చేసుకున్న 2 నెలలకు భర్త మరణం.. తాజాగా భార్య మృతి, అంతా మిస్టరీ !