ఏపీలో శనగ విత్తనాల పంపిణీ ప్రారంభం, 30 శాతం సబ్సిడీ

|

Sep 27, 2020 | 5:27 PM

ఏపీలో శనగ (బెంగాల్‌ గ్రామ్‌) విత్తనాల పంపిణీ శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. రబీలో అత్యధికంగా సాగు చేసే పంటల్లో శనగ ఉంటుందన్న విషయం తెలిసిందే.

ఏపీలో శనగ విత్తనాల పంపిణీ ప్రారంభం, 30 శాతం సబ్సిడీ
Follow us on

ఏపీలో శనగ (బెంగాల్‌ గ్రామ్‌) విత్తనాల పంపిణీ శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. రబీలో అత్యధికంగా సాగు చేసే పంటల్లో శనగ ఉంటుందన్న విషయం తెలిసిందే. సర్కార్ నిర్దేశించిన 30 శాతం సబ్సిడీపై అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో విత్తనాల పంపిణీని వ్యవసాయ శాఖ షురూ చేసింది. రైతు భరోసా కేంద్రాల వద్ద విత్తనాలను రైతులకు గవర్నమెంట్ నిర్ణయించిన ధరకు విక్రయిస్తున్నారు.

రబీలో శనగ సుమారు 4.30 లక్షల హెక్టార్లలో సాగవుతుంది వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అధికంగా శనగను పండిస్తుంటారు. 2019–20 సంవత్సరానికి ఈ నాలుగు జిల్లాల నుంచి 5.04 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది.  ఈ సంవత్సరం రబీలో శనగ సాగును తగ్గించాలని వ్యవసాయ శాఖ ప్రచారం చేసినప్పటికీ కర్షకులు మాత్రం శనగ వైపే మొగ్గుచూపుతున్నారు. తదనుగుణంగా వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించి విత్తనాల పంపిణీ చేపట్టింది.

Also Read : తండ్రిని దారుణంగా చంపిన కొడుకు, తల్లి సాయం