బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేరుగా కేంద్రంతో తలపడాలనే నిర్ణయించుకున్నారు. తమ చీఫ్ సెక్రటరీ అలపన్ బందోపాధ్యాయను కేంద్రానికి పంపే ప్రసక్తే లేదని ప్రకటించిన ఆమె..సోమవారం నాటకీయంగా చక్రం తిప్పారు. బందోపాధ్యాయను రిటైర్ చేయించి తన ప్రభుత్వానికి మూడేళ్ళ పాటు చీఫ్ అడ్వైజర్ (ముఖ్య సలహాదారు) గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఆయనను కేంద్రానికి డెప్యూట్ చేయబోనంటూ ప్రధాని మోదీకి లేఖ రాసిన కొద్ధి సేపటికే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.బందోపాధ్యాయ రిటైర్ కాగానే మరో సీనియర్ అధికారి హెచ్.కె.ద్వివేదీ ఆయన స్థానే చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. బందోపాధ్యాయ విషయంలో కేంద్రం ఉత్తర్వులు తనకు షాక్ కలిగించాయని, ఈ కోవిద్ పాండమిక్ సమయంలోను, యాస్ తుఫాను వల్ల తలెత్తిన నష్టాల తరుణంలోనూ ఆయన సేవలు ఈ రాష్ట్రానికి, ప్రభుత్వానికి, పేదలకు ఎంతో అవసరమని మమత పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసే ఓ అధికారికి అవమానం జరిగాక ఆ ప్రభుత్వం, (కేంద్రం), ప్రధాని ఏ సందేశం ఇవ్వదలచుకున్నారని ఆమె ప్రశ్నించారు.. వీరేమైనా బాండెడ్ లేబరర్సా ? కేంద్రంలో ఎంతోమంది బెంగాలీ కేడర్ అధికారులున్నారు.. చర్చలు జరపకుండానే వారిని నేను రీకాల్ చేయగలుగుతానా అని అన్నారు. అంతటితో ఆగలేదు..’మిస్టర్ ప్రైమ్ మినిష్టర్..బిజీ ప్రైమ్ మినిష్టర్..మిస్టర్ మన్ కీ బాత్ ప్రైమ్ మినిష్టర్’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం రాజ్లకీయంగా పెను ప్రకంపనలు సృష్టించవచ్చునని భావిస్తున్నారు.ఇప్పటికే ఢిల్లీకి, బెంగాల్ కు మధ్య అసలు సఖ్యత లేదు..
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : యూపీలో అనాముషం..డెడ్ బాడీ నదిలో పడేస్తూ వీడియోకు పోజులు ఇచ్చిన యువకులు: vial video.
owl Viral video : నెటిజన్లను ఆకట్టుకుంటున్న గుడ్లగూబ..అందమైన గుడ్లగూబ..ఎన్ని వంకర్లు పోతుందో..!