పశ్చిమ బెంగాల్ లో అన్యోన్యంగా సాగిన భార్యాభర్తల జంటను విడదీసిన పాలిటిక్స్ లో మరో ‘ఎపిసోడ్’! ఈ ఫ్యామిలీ డ్రామా ఇంకా కొనసాగుతోంది. తన భార్య సుజాతా ఖాన్ తృణమూల్ కాంగ్రెస్ లో చేరడంపై ఆగ్రహించిన ఆమె భర్త, బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్..ఆమెకు డైవోర్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు., ఆయన నిర్ణయంపై స్పందించిన సుజాత మళ్ళీ నిన్న మీడియా ముందుకు వచ్చారు. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన ఓ పార్టీయే (బీజేపీ) నాకు విడాకులివ్వాలని నా భర్తను కోరుతోంది అని చెబుతూ ఆమె కన్నీటి పర్యంతమైంది., నా పేరులో తన ఇంటిపేరును తొలగించాలని సౌమిత్రా ఖాన్ కోరాడని, నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు ఇస్తానని హెచ్ఛరించాడని ఆమె అన్నారు. ఇందుకు ఆయనను బీజేపీ నేతలే రెచ్ఛగొడుతున్నారని ఆమె ఆరోపించారు. వారిలో ఒక్కరైనా ఆయనను ఎందుకు అడ్డుకోవడంలేదన్నారు. ఇది మంచిది కాదని ఆయనకు ఎందుకు నచ్ఛజెప్పడంలేదన్నారు. బీజేపీకి చెందిన ‘చెడ్డ నేతలతో’ సౌమిత్రా ఖాన్ కూడా కలిసిపోయారని సుజాతా ఖాన్ పేర్కొన్నారు.
కానీ నేనింగా నా భర్తను ప్రేమిస్తూనే ఉన్నాను అని ఆమె తెలిపారు. ఇంత జరుగుతున్నా ఈమె తాజాగా చేరిన తృణమూల్ కాంగ్రెస్ కూడా వీరి వ్యవహారంపై నోరు మెదపడంలేదు. ఇక బీజేపీ ఇదంతా ‘ డ్రామాలా’ చూస్తోంది. ఈ కపుల్ వ్యవహారాన్ని ఛానెళ్లు, ఇతర మీడియా బాగానే హైలైట్ చేస్తున్నాయి.