మీరు మారాలి, లేకుంటే, బెంగాల్ బీజేపీ చీఫ్ హెచ్చరిక

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఈ పార్టీ కార్యకర్తలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ విధానాలు మార్చుకోకపోతే వారి కాళ్ళు, చేతులు విరుగుతాయని, చివరికు హత్యకు కూడా గురి కావచ్చునని బెంగాల్ బీజేపీ  చీఫ్ దిలీప్ ఘోష్ హెచ్చరించారు. సీఎం మమతా బెనర్జీ సపోర్టర్లకు ఇదే నా వార్నింగ్ అన్నారు. హల్దియాలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలు సజావుగా జరిగేందుకు కేంద్ర భద్రతా దళాలు ఈ […]

మీరు మారాలి, లేకుంటే, బెంగాల్ బీజేపీ చీఫ్ హెచ్చరిక

Edited By:

Updated on: Nov 09, 2020 | 10:55 AM

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఈ పార్టీ కార్యకర్తలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ విధానాలు మార్చుకోకపోతే వారి కాళ్ళు, చేతులు విరుగుతాయని, చివరికు హత్యకు కూడా గురి కావచ్చునని బెంగాల్ బీజేపీ  చీఫ్ దిలీప్ ఘోష్ హెచ్చరించారు. సీఎం మమతా బెనర్జీ సపోర్టర్లకు ఇదే నా వార్నింగ్ అన్నారు. హల్దియాలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలు సజావుగా జరిగేందుకు కేంద్ర భద్రతా దళాలు ఈ రాష్ట్రానికి వస్తాయన్నారు. ఇక్కడి పోలీసులు దూరంగా చెట్ల కింద కూర్చుని పాన్ నములుతూ ఓటింగ్ ను చూడాల్సి ఉంటుందన్నారు. బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం ఉన్నప్పుడు జంగిల్ రాజ్యం ఉండేదని, కానీ తాము గూండాలను తరిమివేశామని దిలీప్ ఘోష్ చెప్పారు. కాగా హోం మంత్రి అమిత్ షా ఈ రాష్ట్రానికి వఛ్చి రెండురోజులైందో లేదో ఘోష్ గారు ఇలా రెచ్చి పోయారు.