AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలుగుబంటి దాడిలో 60 గాయాలు.. చిన్న చాకుతో పోరాడి ప్రాణాలతో బయటపడిన వీరుడి కథ! విన్నారంటే..

భయంకరమైన క్రూర మృగం దాడి చేసినప్పుడు సాధారణంగా ఎవరైనా భయంతో నిశ్చేష్టులవుతారు. కానీ, కెనడాకు చెందిన 45 ఏళ్ల కోలిన్ డౌలర్ అనే వ్యక్తి అత్యంత భయాందోళనకరమైన పరిస్థితిలోనూ అద్భుతమైన సమయస్ఫూర్తి, ధైర్యం ప్రదర్శించి మృత్యుముఖం నుండి తిరిగి వచ్చారు. గ్రిజ్లీ ఎలుగుబంటి బారిన పడి 60కి పైగా గాయాలైనప్పటికీ ఆయన సాధించిన సజీవ పోరాటం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

ఎలుగుబంటి దాడిలో 60 గాయాలు.. చిన్న చాకుతో పోరాడి ప్రాణాలతో బయటపడిన వీరుడి కథ! విన్నారంటే..
Bear Attack Survivor
Jyothi Gadda
|

Updated on: Aug 21, 2026 | 9:31 PM

Share

కెనడాలోని మారుమూల అటవీ ప్రాంతంలో కోలిన్ మైంటైన్ బైకింగ్ చేసుకుంటూ వెళ్తుండగా, ఒక్కసారిగా ఒక భారీ గ్రిజ్లీ ఎలుగుబంటి ఆయనకు ఎదురైంది. మొదట బైక్‌ను అడ్డుగా పెట్టి దానిని దూరంగా ఉంచేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ క్రూర మృగం ఆయనపై విరుచుకుపడింది. ఆయనను కిందకు లాగి, తొడ భాగంలో తీవ్రంగా కొరకడం ప్రారంభించింది. ఎలుగుబంటి పళ్లు తన ఎముకల వరకు చొచ్చుకెళ్తున్న భయంకరమైన వేదనను ఆయన అనుభవించారు. అతన్ని సుమారు 30 నుండి 40 అడుగుల దూరంలో ఉన్న ఒక పొద దగ్గరకు లాక్కెళ్లింది. ఆ తర్వాత ఎలుగుబంటి కోలిన్‌ను నిర్దాక్షిణ్యంగా కరవడం ప్రారంభించింది. ఆ దాడి ఎంత తీవ్రంగా ఉందంటే, ఎలుగుబంటి దాడిలో తన కిడ్నీ దెబ్బతినడమే కాకుండా, శరీరం నుండి విపరీతంగా రక్తం కారిపోతోంది.

ఆ క్షణంలో తాను బ్రతకలేనేమోనని అనుకున్నానని కోలిన్ తర్వాత చెప్పాడు. అతను తన భార్య, పిల్లల గురించి ఆలోచించాడు. వారిని మళ్ళీ చూడలేనేమోనని అనుకున్నాడు. మరణం తథ్యమని భావించిన ఆ క్లిష్ట సమయంలో కోలిన్‌కు తన జేబులో ఉన్న రెండు అంగుళాల చిన్న జేబు చాకు గుర్తుకొచ్చింది. ఎలాగోలా అతను రెండు చేతులతో దాన్ని అందుకోగలిగాడు. వెంటనే దానిని బయటకు తీసి ఎలుగుబంటి మెడ భాగంలో గట్టిగా పొడిచారు. ఊహించని ఈ ఎదురుదాడితో నొప్పి తాళలేక ఆ ఎలుగుబంటి కోలిన్‌ను విడిచిపెట్టి అడవిలోకి పారిపోయింది.

దాడి నుండి బయటపడినప్పటికీ కోలిన్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కాలి భాగం తీవ్రంగా దెబ్బతిని నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ, తన షర్టుతో కాలుకు కట్టు కట్టుకుని తీవ్ర రక్తస్రావం మధ్యలోనే 2 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ సమీపంలోని లాగింగ్ క్యాంప్‌నకు చేరుకున్నారు. అక్కడి సిబ్బంది తక్షణమే ప్రథమ చికిత్స అందించి, ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. కోలిన్ ప్రాణాలను కాపాడటానికి వైద్యులు ఆరున్నర గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత అతను దాదాపు 40 రోజులు ఆసుపత్రిలో గడిపాడు. తీవ్రమైన గాయాలైనప్పటికీ, చికిత్స అనంతరం చాలా రోజుల తర్వాత కోలుకున్న అతను క్రమంగా సాధారణ జీవితానికి తిరిగి వచ్చాడు. తన కుటుంబాన్ని మళ్లీ కలుసుకోలేనేమోనని భయపడిన ఒక దాడి నుండి అతను ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇవి కూడా చదవండి

వైద్యులు ఆయన శరీరానికి 60కి పైగా కుట్లు వేసి, సుదీర్ఘ చికిత్స తర్వాత ప్రాణాలను కాపాడగలిగారు. చావు అంచుల వరకు వెళ్లినా ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తి ఉంటే మృత్యువును సహితం జయించవచ్చని కోలిన్ డౌలర్ సాహసగాథ నిరూపిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us