AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అసలు ఇలాంటి ఆలోచన ఎలా వస్తాయిరా..? కారుకు ఏకంగా చెక్క కవచం..!

సోషల్ మీడియాలో ఓ విచిత్రమైన కారు వీడియో వైరల్‌గా మారింది. ఈ కారు మొత్తం భారీ చెక్క కవచంతో కప్పి ఉంది. చిన్నపాటి ప్రమాదాల నుండి రక్షణ కోసమా లేక ప్రకటన కోసమా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీన్ని కొందరు 'జుగాడ్' అంటూ ప్రశంసిస్తుంటే, మరికొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మారుతి ఈకో కారుకు ఈ చెక్క కవచం నెటిజన్లకు మంచి వినోదాన్ని పంచుతోంది.

Watch: అసలు ఇలాంటి ఆలోచన ఎలా వస్తాయిరా..? కారుకు ఏకంగా చెక్క కవచం..!
Wooden Car Armor Protection
Balaraju Goud
|

Updated on: Aug 21, 2026 | 6:26 PM

Share

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల దేశీ లోకల్ టాలెంట్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని నవ్వులు పూయిస్తే.. మరికొన్ని అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందా? అని ఆశ్చర్యపోయేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఓ విచిత్రమైన కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డుపై వెళ్తున్న కారును చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో రద్దీగా ఉండే రోడ్డుపై ఓ కారు ప్రయాణిస్తోంది. అయితే ఆ కారును చూస్తే మాత్రం సాధారణ వాహనంలా కనిపించదు. కారు చుట్టూ భారీ చెక్క ఫ్రేమ్‌ను ఏర్పాటు చేశారు. బంపర్ నుంచి సైడ్ ప్యానెల్స్, పైకప్పు వరకు మొత్తం చెక్క నిర్మాణంతో కప్పేశారు. దీంతో కారు మొత్తానికి ఓ పెద్ద చెక్క కవచం వేసినట్లుగా కనిపిస్తోంది.

సాధారణంగా కార్లను గీతలు, చిన్నపాటి డ్యామేజ్‌ల నుంచి రక్షించేందుకు కవర్లు, పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్‌లు, టెఫ్లాన్ కోటింగ్ వంటి వాటిని ఉపయోగిస్తారు. కానీ ఈ వాహనానికి మాత్రం ఏకంగా చెక్కతో రక్షణ కవచం ఏర్పాటు చేయడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ట్రాఫిక్‌లో చిన్నపాటి ప్రమాదాలు జరిగినా కారు దెబ్బతినకుండా ఉండేందుకు ఇలా చేశారా? లేక మరేదైనా కారణముందా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోపై సరదా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు దీనిని ‘జుగాడ్‌కు పితామహుడు’ అంటూ ప్రశంసిస్తుంటే.. మరికొందరు కారు రూపాన్ని చూసి నవ్వుకుంటున్నారు. అయితే కామెంట్లలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇది సాధారణ కారు యజమాని చేసిన జుగాడ్ కాదని, ప్రకటన కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనం కావచ్చని ఓ నెటిజన్ పేర్కొన్నారు.

అలాగే వీడియోలో కనిపిస్తున్న వాహనం మారుతి ఓమ్ని కాదని, మారుతి ఈకో అని కొందరు గుర్తించారు. అయితే ఈ వీడియోకు సంబంధించిన అసలు సందర్భం, ప్రకటన కోసం ఎవరు రూపొందించారనే వివరాలు స్వతంత్రంగా ధృవీకరించడంలేదు. ఏదేమైనా.. చెక్క కవచంతో రోడ్డుపై దూసుకెళ్తున్న ఈ కారు ప్రస్తుతం నెటిజన్లకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
భారీ క్రెయిన్‌లతో 48 గంటలు కష్టపడ్డా.. ఇంచు కూడా కదలని విగ్రహం!
భారీ క్రెయిన్‌లతో 48 గంటలు కష్టపడ్డా.. ఇంచు కూడా కదలని విగ్రహం!
కుమారుడు లేకపోతే శ్రాద్ధం ఎవరు చేయాలి? గరుడ పురాణంలో ఏం చెప్పారు?
కుమారుడు లేకపోతే శ్రాద్ధం ఎవరు చేయాలి? గరుడ పురాణంలో ఏం చెప్పారు?