Bank Holidays: బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్.. రేపటి నుంచి 5 రోజుల పాటు బ్యాంకులు బంద్..

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకొనే  సంక్రాంతి పండగతో పాటు వివిధ రాష్ట్రాల్లో నిర్వహించుకునే పర్వదినాల సందర్భంగా రేపటి (జనవరి 11) నుంచి 5 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి.

Bank Holidays: బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్.. రేపటి నుంచి 5 రోజుల పాటు బ్యాంకులు బంద్..
Bank Holidays

Updated on: Jan 10, 2022 | 1:56 PM

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకొనే  సంక్రాంతి పండగతో పాటు వివిధ రాష్ట్రాల్లో నిర్వహించుకునే పర్వదినాల సందర్భంగా రేపటి (జనవరి 11) నుంచి 5 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి.  ఈ మేరకు  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా   ఇప్పటికే  బ్యాంక్ సెలవులు జాబితాను వెబ్ సైట్ లో ప్రకటించింది.   . ఆర్‌బీఐ క్యాలెండర్ ప్రకారం జనవరి నెలలో 16 రోజుల వరకు సెలవులు ఉన్నాయి. వీటిల్లో ఇప్పటికే కొన్ని హాలిడేస్ అయిపోయాయి.  ఈ క్రమంలోనే  దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుపుకొనే  వివిధ పండగల కారణంగా రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా బ్యాంకుల సెలవులు మారుతాయి.  కాబట్టి  తప్పనిసరిగా బ్యాంక్  కు  వెళ్లాలని భావించే వారు బ్యాంక్ హాలిడేస్ తెలుసుకోవాలి.  మరి ఆర్‌బీఐ ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం ఈ వారలో ఎప్పుడెప్పుడు బ్యాంకులు పనిచేయవో తెలుసుకుందాం.

*జనవరి 11 – మిషనరీ డే – ఐజ్వాల్ (మిజోరాం)

*జనవరి 12 – స్వామి వివేకానంద జయంతి – కోల్‌కతా(పశ్చిమ బెంగాల్)

*జనవరి 14 – మకర సంక్రాంతి/ పొంగల్ -( అహ్మదాబాద్, చెన్నై)

*జనవరి 15 – సంక్రాంతి /  సంక్రాంతి మాఘే / తిరువల్లువార్ డే – (తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాల్లో)

*జనవరి 16- ఆదివారం

అయితే  బ్యాంక్ సెలవులు ఉన్నా కూడా కస్టమర్లు ఆన్‌లైన్ ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి వాటి ద్వారా బ్యాంక్ సేవలు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాయి.

Also Read:

Konidela Upasana: రామ్ చరణ్ డాడీ డ్యూటీస్ విత్ రైమ్.. ఇన్ స్టాలో ఉపాసన ఇంట్రెస్టింగ్ పోస్ట్..

PM Narendra Modi: ప్రధాని చేసిన పనికి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోన్న కాశీ విశ్వనాథ్ ధామ్ సిబ్బంది..

ఇంతకు మోడీ ఏం చేశారంటే..

Sanjana Galrani: శుభవార్త చెప్పిన బుజ్జిగాడు హీరోయిన్.. త్వరలోనే తల్లి కాబోతున్న శాండల్ వుడ్ హీరోయిన్..