ఎన్ని ఇబ్బందులున్నా విద్యుత్‌ చార్జీలు మాత్రం పెంచం : విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల పై బారాలు వేయమని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే విద్యుత్‌ రంగాన్ని గాడిలో పెడతామని ఆయన స్పష్టం చేశారు.

ఎన్ని ఇబ్బందులున్నా విద్యుత్‌ చార్జీలు మాత్రం పెంచం : విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

Updated on: Dec 07, 2020 | 7:01 AM

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల పై భారం వేయమని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే విద్యుత్‌ రంగాన్ని గాడిలో పెడతామని ఆయన స్పష్టం చేశారు. ఏపీఎస్‌ఈసీఎం కొత్త లోగోను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని తెలిపిన వివరాలను చంద్రశేఖరరెడ్డి మీడియాకు వివరించారు. కరోనా సమయంలో విద్యుత్‌ సంస్థలు మరింత ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అయినా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకోకూడదని సీఎంజగన్ ఆదేశించారని అందులో భాగంగానే విద్యుత్‌ పంపిణీ సంస్థలు చార్జీల పెంపు ప్రతిపాదన లేకుండా వార్షిక ఆదాయ అవసర నివేదికలను ఏపీఈఆర్‌సీకి సమర్పించామని అన్నారు. 2019–20లో రూ.17,904 కోట్లు విడుదల చేసిందని, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం రూ.8,353.58 కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్‌ సరఫరా కోసం రూ.717.39 కోట్లు సబ్సిడీ ప్రభుత్వం కేటాయించిందని చంద్రశేఖరరెడ్డి గుర్తుచేశారు.చౌక విద్యుత్‌ లక్ష్య సాధన కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి నూతన విధానాలను అధ్యయనం చేయాలని విద్యుత్‌ సంస్థలకు మంత్రి సూచించారు.