Bajaj Auto: ఇక సీఎన్‌జీ బైక్స్‌.. బజాజ్‌ ఆటో సరికొత్త ప్రయోగం.. వర్కవుట్‌ అవుతుందా?

|

Feb 02, 2024 | 8:47 AM

ప్రముఖ టూ వీలర్‌ తయారీ సంస్థ బజాబ్‌ ఆటో ఓ కొత్త ట్రెండ్‌ను సృష్టించేందుకు సమాయత్తమవుతోంది. సీఎన్‌జీ ఆధారిత ద్విచక్రవాహనాలను తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ సీఎన్‌జీ ఆటోలు, మినీ ట్రక్కులను తీసుకొచ్చింది. ఇప్పుడు దీనిని బైక్‌లు, స్కూటర్లలోనూ తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తోంది. అన్నీ కుదిరితే 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే దీనిని లాంచ్‌ చేసే అవకాశం ఉందని కంపెనీ చెబుతోంది.

Bajaj Auto: ఇక సీఎన్‌జీ బైక్స్‌.. బజాజ్‌ ఆటో సరికొత్త ప్రయోగం.. వర్కవుట్‌ అవుతుందా?
Bajaj Cng Motorcycle
Follow us on

ప్రపంచ దృష్టి పర్యావరణ హిత వాహనాలపై ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. యూఎస్‌ఏ, అమెరికా, ఇంగ్లాండ్‌ వంటి దేశాల్లో ఇప్పటికే చాలా కార్ల కంపెనీ పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్‌ వాహనాలనే తయారుచేస్తున్నాయి. మన దేశంలో ఈ ట్రెండ్‌ ఇప్పటికే ప్రారంభమైంది. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు కార్బన్‌ ఉద్ఘారాలను తగ్గించలనే లక్ష్యంతో వీటని ప్రోత్సహిస్తున్నారు. అయితే కేవలం ఎలక్ట్రిక్‌ వాహనాలే పర్యావరణ హితమైనవి కావు.. కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌(సీఎన్‌జీ) కూడా పూర్తి పర్యావరణ హితమైనది. ఈ క్రమంలో ప్రముఖ టూ వీలర్‌ తయారీ సంస్థ బజాబ్‌ ఆటో ఓ కొత్త ట్రెండ్‌ను సృష్టించేందుకు సమాయత్తమవుతోంది. సీఎన్‌జీ ఆధారిత ద్విచక్రవాహనాలను తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ సీఎన్‌జీ ఆటోలు, మినీ ట్రక్కులను తీసుకొచ్చింది. ఇప్పుడు దీనిని బైక్‌లు, స్కూటర్లలోనూ తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తోంది. అన్నీ కుదిరితే 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే దీనిని లాంచ్‌ చేసే అవకాశం ఉందని కంపెనీ చెబుతోంది. ఈ సీఎన్‌జీ ద్విచక్ర వాహనా ప్రోటో టైప్‌ని భారత్‌ మొబిలిటీ ఎక్స్‌పో 2024లో ప్రదర్శించనున్నట్లు బజాజ్‌ ప్రకటించింది. ఈ సీఎన్‌జీ వాహనాలతో పాటు ఫ్లెక్‌ ఫ్యూయల్‌, మోనో ఫ్యూయల్‌, పలు ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రోటో టైప్‌లను కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సీఎన్‌జీ ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనాలకు మంచి ప్రత్యామ్నాయం అవుతాయి.

మరిన్ని సీఎన్‌జీ వాహనాలు..

బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రాకేష్ శర్మ మాట్లాడుతూ సీఎన్‌జీ అనేది పర్యావరణ హిత వాహనాల్లో మంచి ఆప్షన్‌ కాగలదని తెలిపారు. ఇప్పటికే మూడు చక్రాల వాహనాల్లో సీఎన్‌జీ వేరియంట్లను విజయవంతంగా తాము నడుపుతున్నట్లు చెప్పారు. అలాగే ద్విచక్ర వాహనాల్లో కూడా తాము విజయవంతం అవుతామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న కాలంలో మరిన్ని వేరియంట్లను తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కొత్త బ్రాండ్‌ పేరుతో..

త్వరలో రానున్న ఈ కొత్త సీఎన్‌జీ-ఆధారిత మోటార్‌సైకిళ్లు పూర్తిగా కొత్త బ్రాండ్ పేరుతో విడుదల కానున్నాయి. పెట్రోల్‌తో నడిచే వాటితో పోల్చినప్పుడు ఈ వాహనాలు అధిక ధరను కలిగి ఉంటాయని రాకేష్ శర్మ సూచనప్రాయంగా తెలిపారు. పెట్రోలు, సీఎన్‌జీని రెండింటితోనూ నడిచే విధంగా దీనిని తయారు చేస్తున్నందున ఉత్పత్తి వ్యయం పెరిగిందన్నారు. అందుకే ధర ఎక్కువవుతుందని వివరించారు. ఇతర శిలాజ ఇంధనాలతో పోలిస్తే సీఎన్‌జీ అనేది శిలాజ ఇంధనం అయినప్పటికీ చాలా శుభ్రంగా ఉంటుందన్నారు. భారతదేశ స్థిరమైన మొబిలిటీ డ్రైవ్‌లో పాత్ర పోషిస్తుందని శర్మ చెప్పారు. దీనిని వాణిజ్యపరంగా కూడా పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. కాగా సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌ని ఉపయోగించే మోడల్‌ల వివరాలను ఇంకా వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..