AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీస్‌ స్టేషన్‌లో వీడియోకాల్‌ విచారణ

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం అన్ లాక్ ప్రారంభిస్తే.. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్చంధంగా లాక్ డౌన్ విధించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం పోలీసు కమిషనర్ తఫ్సీర్‌ ఇక్బాల్‌ కరోనా నియంత్రణకు వినూత్నంగా ఫ్లాన్ చేశారు.

పోలీస్‌ స్టేషన్‌లో వీడియోకాల్‌ విచారణ
Balaraju Goud
| Edited By: |

Updated on: Jul 14, 2020 | 7:17 PM

Share

చైనాలో వెలుగు చూసిన క‌రోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అంతకంతకూ ఆక్రమిస్తున్న ఈ డెడ్లీ వైరస్ తన తీవ్రతను మ‌రింత పెంచుతోంది. జనం కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం అన్ లాక్ ప్రారంభిస్తే.. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్చంధంగా లాక్ డౌన్ విధించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం పోలీసు కమిషనర్ తఫ్సీర్‌ ఇక్బాల్‌ కరోనా నియంత్రణకు వినూత్నంగా ఫ్లాన్ చేశారు. పోలీసు సిబ్బంది ఎవరూ కరోనా బారిన పడకుండా చర్యలు చేపట్టారు. సీపీ ఇక్బాల్ ఆదేశాల మేరకు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే వారి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఫిర్యాదులు చేసేందుకు పోలీసులు వీడియో కాల్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో మొత్తం 25 లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌ స్టేషన్లు, ఒక మహిళా పోలీస్‌ స్టేషన్‌, క్రైం పోలీస్‌ స్టేషన్‌, ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. పీఎస్‌లలో స్టేషన్‌ హౌస్‌ అధికారులు ఫిర్యాదుదారులతో మాట్లాడేందుకు వీడియోకాల్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఇటీవల సీపీ తఫ్సీర్‌ఇక్బాల్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కో స్టేషన్‌లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు పోలీస్‌ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోనే ప్రప్రథమంగా వైరా పోలీస్‌ స్టేషన్‌లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో బయట వీడియోకాల్‌కు సంబంధించిన కెమెరాను అమర్చారు. ఫిర్యాదుదారుడు వీడియో కెమెరా ముందు కూర్చోని తమ సమస్యను వెల్లడిస్తాడు. దీంతో అతని ఫిర్యాదును రికార్డు చేసి, ఫిర్యాదును పరిశీలించిన తర్వాత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, ఎస్సై వీడియోకాల్‌ ద్వారా ఫిర్యాదుదారులను విచారించి వివరాలు తెలుసుకుంటున్నారు. ఫిర్యాదుదారుడికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టారు. పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బంది పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే వారితో కనీసం 10 అడుగుల దూరం నుంచి మాట్లాడుతున్నారు. వివిధ అవసరాల నిమిత్తం వచ్చే వారి కోసం శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఖమ్మం జిల్లాలో మొదట వైరా పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని వైరా, కొణిజర్ల, తల్లాడ, మధిర పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని పీఎస్‌లలో ఇప్పటికే వీడియో కాల్‌ విధానం అమలవుతున్నది. అంతేకాకుండా పీఎస్‌ల పరిధిలో విధిగా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.