
రామజన్మభూమిలో మరోసారి దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. ఆలయ నిర్మాణంలో భాగంగా భూమి చదును చేస్తుండగా.. ఈ విగ్రహాలు వెలుగుచూశాయి.
అయోధ్యలో పురాతన దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. రామజన్మభూమిలో స్థలాన్ని చదును చేస్తుంగా.. విరిగిన దేవతా విగ్రహాలతో పాటు ఐదు అడుగుల ఎత్తైన శివలింగం, ఏడు నల్లరాతి స్థంభాలు, ఆరు ఎర్ర రాతి స్థంభాలు, కలశంతో పాటు పలు పురాతన వస్తువులు లభించాయి.
యేళ్ల తరబడి వివాదాల్లో ఉన్న అయోధ్య సమస్య సుప్రీంకోర్టు చొరవతో గతేడాది పరిష్కరం లభించింది. దీంతో రామమందిరం నిర్మించేందుకు ఆలయ ట్రస్ట్ శిథిలాను తొలగిస్తోంది. ఇందులో భాగంగా మే11 నుంచి రామాలయం పనులు ఉపందుకున్నాయి. తవ్వకాల్లో ఆలయ ఆనవాళ్లు పూర్ణ కుంభం వంటి ఎన్నో అవశేషాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రామ జన్మభూమిలో గత పది రోజులుగా భూమిని చదును చేస్తున్నామని.. ఈ క్రమంలో అక్కడ శిథిలాలను తొలగిస్తున్నామన్నారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాజ్. ఈ తవ్వకాల్లో పిల్లర్లతోపాటు శిల్పాలు వెలుగు చూశాయన్నారు.