షాకింగ్ రిపోర్ట్.. ఒక మనిషి రోజులో ఎన్ని ఆలోచనలు చేస్తాడంటే?

| Edited By:

Jul 20, 2020 | 4:09 PM

ఒక మనిషి రోజులో ఎన్ని ఆలోచనలు చేస్తాడు? అనే డౌట్ మీకు కూడా వచ్చే ఉంటుంది కదా! సాధారణంగా ఒక మనిషి ఖాళీగా ఉన్నా.. లేక ఏదో ఒక పని చేస్తున్నా కూడా వ్యక్తి బ్రేయిన్ ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. మనకు తెలియకుండానే అలా జరుగుతూంటాయట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..

షాకింగ్ రిపోర్ట్.. ఒక మనిషి రోజులో ఎన్ని ఆలోచనలు చేస్తాడంటే?
Brain Fog
Follow us on

ఒక మనిషి రోజులో ఎన్ని ఆలోచనలు చేస్తాడు? అనే డౌట్ మీకు కూడా వచ్చే ఉంటుంది కదా! సాధారణంగా ఒక మనిషి ఖాళీగా ఉన్నా.. లేక ఏదో ఒక పని చేస్తున్నా కూడా వ్యక్తి బ్రేయిన్ ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. మనకు తెలియకుండానే అలా జరుగుతూంటాయట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నిద్రలో ఉన్నప్పుడు కూడా మెదడు యాక్టీవ్‌గా ఉంటుంది. మనకు తెలియకుండానే నిద్రలో కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. మామూలుగా ఒక మనిషి రోజుకు ఎన్ని రకాల ఆలోచనలు చేస్తాడు. అంటే రెండు వందల నుంచి మూడు వందల వరకూ ఆలోచనలు చేస్తాడని ఇది వరకు పలువురు నిపుణులు పేర్కొన్నారు.

కానీ అది తప్పని.. కెనడాలోని క్వీన్స్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీరు వ్యక్తి ఆలోచనలపై అనేక రకాల పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలలో అనేక విషయాలను వెల్లడించారు. ఒక మనిషి సగటున రోజుకు 6 వేల వరకు ఆలోచనలు చేస్తాడని కెనాడా క్వీన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఒక రోజుకు మనిషి ఎన్ని ఆలోచనలను లెక్కించడం కోసం శాస్త్రవేత్తలు పలువురు వ్యక్తులను ఇప్పటికే పరీక్షించారు. బ్రెయిన్ ఎప్పుడైతే యాక్టీవ్‌గా ఉంటుందో అప్పుడు నిద్రలో కూడా రకరకాల ఆలోచనలు వస్తూంటాయని పరిశోధనలో వెల్లడైంది.

అంతేకాదు మనిషి చేసే ఆలోచనలు లెక్కించడం కోసం ఓ కొత్త పద్దతిని కూడా ప్రవేశ పెట్టారు శాస్త్రవేత్తలు. దీనికి ‘థాట్ వర్మ్’ అనే పేరు పెట్టారు. ఒక రోజులో మనిషి ఆలోచన మొదలైనప్పటి నుంచి చివరి ఆలోచన వరకు ఈ పద్దతి ద్వారా గణించి సంఖ్యను నిర్ధారించినట్టు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అలాగే వచ్చిన ఆలోచనల సంఖ్యనే ఆరు వేల వరకూ ఉంటాయని కెనడా క్వీన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read More: 

బద్ధలైన అగ్ని పర్వతం.. మొదటిసారిగా కెమెరాకు చిక్కిన దృశ్యాలు

డిశ్చార్జ్ తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..