Australian Open Quarantine: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ నిర్వాహకుల క్వారంటైన్ నిబంధనలపై వ్యతిరేకత ఎదురవుతోంది. గ్రాండ్‌స్లామ్‌లో పాల్గొనే ఆటగాళ్లకు విశాలవంతమైన మెల్‌బోర్న్ హోటల్‌ను క్వారంటైన్ సెంటర్‌గా ఏర్పాటు చేశారు. అయితే హోటల్ చుట్టుపక్కల నివాసం ఉంటున్న స్థానికులు తమ ఆరోగ్యంపై ఆందోళనపై వ్యక్తం చేస్తున్నారు.
కనీసం అపార్ట్‌మెంట్ సంఘాలను కూడా సంప్రదించకుండా హోటల్ మేనేజ్‌మెంట్ అంగీకరించుకోవడం ఏంటని మండిపడుతున్నారు. టోర్నీ నిర్వాహకులపై కోర్టులో కేసు వేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే హోటల్ నిర్వాహకులు మాత్రం తాము అన్నిరకాల రక్షణ చర్యలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. ఈ విషయాన్ని కూడా అపార్ట్ మెంట్ సంఘాలకు తెలియజేశామని తెలిపారు. కాగా, టోర్నీ కోసం ఈ నెల మధ్య నుంచి ఆటగాళ్ల రాకపోకలు ఆరంగం కానున్నాయి. వీరందరికి 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి. వచ్చే నెల 8 నుంచి 21 వరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ జరగనుంది.
India Vs Australia 2020: ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ.. మూడో టెస్టుకు కీలక పేస్ బౌలర్ దూరం..