గాల్వన్ ఘర్షణ.. 20 మంది భారత జవాన్లు మృతి..!

| Edited By:

Jun 17, 2020 | 9:19 AM

గాల్వన్ లోయలో భారత్- చైనా బలగాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో సుమారు 20 మంది భారత సైనికులు మృతి చెందినట్లు జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐ ఈ మేరకు వివరాలను వెల్లడించింది. ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అటు చైనా వైపు సుమారు 43 మంది గాయపడటం లేదా మరణించడం జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం అందించాయి. గాల్వన్ లోయ ఘటనలో గాయపడిన, మృతి చెందిన […]

గాల్వన్ ఘర్షణ.. 20 మంది భారత జవాన్లు మృతి..!
Follow us on

గాల్వన్ లోయలో భారత్- చైనా బలగాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో సుమారు 20 మంది భారత సైనికులు మృతి చెందినట్లు జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐ ఈ మేరకు వివరాలను వెల్లడించింది. ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అటు చైనా వైపు సుమారు 43 మంది గాయపడటం లేదా మరణించడం జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం అందించాయి. గాల్వన్ లోయ ఘటనలో గాయపడిన, మృతి చెందిన సైనికులను తీసుకెళ్లేందుకు గగనతలంలో LAC అంతటా చైనీస్ చాపర్లు చక్కర్లు కొట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కాగా, సోమవారం లడఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్, చైనా దేశాల సైనిక దళాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారత కల్నల్ స్థాయి అధికారితో పాటు 20 మంది మృతి చెందారు. ఇరు దేశాలూ తమ బలగాలను ఉపసంహరించుకుంటున్న తరుణంలో గాల్వన్ లోయలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఇండియన్ ఆర్మీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. గత 40 ఏళ్ళలో ఇరు దేశాల సరిహద్దుల్లో ఒక్క తూటా కూడా పేలలేదు. ఇంతటి హింసాత్మక ఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. కాగా, పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇరు దేశాల సైన్యాధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్ CDS చీఫ్, త్రివిధ దళాధిపతులు, విదేశాంగ మంత్రితో చర్చించగా.. కాసేపటి క్రితం చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలపై హోంమంత్రి అమిత్ షా.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటి అయ్యి తదుపరి వ్యుహలపై సమాలోచనలు చేశారు.

గాల్వాన్ వ్యాలీలోని పాంగాంగ్ సో, డెమ్ చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతాల్లోనూ కొన్ని వారాలుగా భారత్..చైనా సైనికుల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. పాంగాంగ్ సోతో బాటు పలు డీ-ఫ్యాక్టో బోర్డర్స్ లో.. ముఖ్యంగా వాస్తవాధీన రేఖ వద్ద చైనా దళాలు ముందుకు చొచ్ఛుకు వచ్చాయి. చర్చలు జరిగినప్పటికీ పాంగాంగ్ సరస్సు వద్ద గస్తీ తిరుగుతున్న రెండు దేశాల సైనికులూ ఒక దశలో పిడిగుద్దులు కురిపించుకున్నారు. అయితే ఈ నెల 6న ఉభయ దేశాల సైనికాధికారుల మధ్య మళ్ళీ చర్చలు జరిగిన దరిమిలా.. గాల్వన్ ప్రాంతంలో చైనా సైన్యం కొంత వెనక్కి తగ్గగా.. భారత ఆర్మీ కూడా తన సైనిక వాహనాలతో బాటు తిరిగి వెనక్కి మళ్లింది.