గుడ్ న్యూస్: కరోనా వైరస్ లక్షణాలు లేనివారితో.. సంక్రమణం అరుదు..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే.. ఎలాంటి లక్షణాలూ లేని కరోనా బాధితుల నుంచి ఇతరులకు వైరస్ సంక్రమించడం అరుదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పేర్కొంది.

గుడ్ న్యూస్: కరోనా వైరస్ లక్షణాలు లేనివారితో.. సంక్రమణం అరుదు..
Follow us

| Edited By:

Updated on: Jun 09, 2020 | 11:21 AM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే.. ఎలాంటి లక్షణాలూ లేని కరోనా బాధితుల నుంచి ఇతరులకు వైరస్ సంక్రమించడం అరుదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పేర్కొంది. లక్షణాలు లేనివారి ద్వారా అత్యంత వేగంగా వైరస్ వ్యాపిస్తోందని, అందుకే మహమ్మారికి అడ్డుకట్ట పడటం లేదని ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని డబ్ల్యూహెచ్వో కొవిడ్-19 సాంకేతిక విభాగం ఉన్నతాధికారి మారియా వాన్ కెర్ఖోవ్ ఖండించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక విభాగం ఉన్నతాధికారి మారియా వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ.. కోవిద్-19 లక్షణాలు లేని బాధితుల నుంచి ఇతరులకు చాలా స్వల్ప స్థాయిలోనే సోకుతోందని, గరిష్ఠంగా ఇది 6% వరకూ ఉంటుందన్నారు. మహమ్మారి భారీగా విజృంభించేందుకు ఇది దోహదపడదని, ఇలాంటి విధానంలో వైరస్ సోకినవారిలో లక్షణాలు కూడా స్వల్పస్థాయిలోనే ఉంటాయన్నారు.