50% ఫీజులు తగ్గించాలని ప్రైవేటు స్కూళ్లకు ఆదేశం..

కోవిద్-19 కరాళ నృత్యం చేస్తోంది. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. అయితే.. ఏప్రిల్ నెలకు సంబంధించి ఫీజులను 50 శాతం మేరకు తగ్గించాలని అస్సాంలోని ప్రైవేటు పాఠశాలలకు అస్సాం విద్యా శాఖ

50% ఫీజులు తగ్గించాలని ప్రైవేటు స్కూళ్లకు ఆదేశం..

Edited By:

Updated on: Apr 22, 2020 | 7:37 PM

కోవిద్-19 కరాళ నృత్యం చేస్తోంది. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. అయితే.. ఏప్రిల్ నెలకు సంబంధించి ఫీజులను 50 శాతం మేరకు తగ్గించాలని అస్సాంలోని ప్రైవేటు పాఠశాలలకు అస్సాం విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ కారణంగా అనేక కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు ఇలాంటి సమయంలో వారు పూర్తి ఫీజులు చెల్లించలేరని, అందుకే ప్రైవేటు పాఠశాలలకు ఈ మార్గదర్శకాలు ఇచ్చినట్లు అస్సాం విద్యాశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా.. ‘‘అన్ని ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏప్రిల్ నెలకు సంబంధించి విద్యార్థుల ఫీజులను 50 శాతం మేర తగ్గించాలని చెప్పాం. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఇలాంటి సమయంలో ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవద్దని, అలాగే టీచర్లు ఇతర పాఠశాల సిబ్బంది జీతాల్లో ఎలాంటి కోత విధించారదని ఆదేశించాం’’ అని అస్సాం విద్యా శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.

Also Read: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. ఇక వారిపై దాడి చేస్తే జైలు, భారీ జరిమానా

 

Follow Us