అసోం ప్రభుత్వం సంచలన పథకాన్ని ప్రవేశపెట్టింది. బాల్య వివాహాలను ఆపేందుకు, అమ్మాయిలను చదువుల దిశగా ప్రోత్సహించేందుకు కాస్త వినూత్నంగా ఆలోచించింది. రాష్ట్రంలో పెళ్లి చేసుకోబోయే ప్రతి అమ్మాయికు 10 గ్రాముల బంగారం కానుకగా అందించేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టుంది. ఈ పథకాన్ని బుధవారం ఎనౌన్స్ చేయడంతో పాటు విధివిధానాలు కూడా వెల్లడించింది. అయితే బంగారాన్ని డైరెక్ట్‌గా ఇవ్వకుండా.. రూ. 30 వేల నగదును ప్రభుత్వం వధువు అకౌంట్‌లో డిపాజిట్ చేయనుంది. ఇకపై ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో..అప్పుడు ఉన్న బంగారం ఖరీదును బట్టి..పథకం ద్వారా ఇచ్చే నగదులో మార్పులు ఉంటాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానున్నట్లు అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. దీనికి ‘అరుంధతి బంగారు పథకం’ అనే పేరును ఖరారు చేశారు.
అర్హతలు: