అసోంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. గోపాల్‌పుర ప్రాంతంలో బస్సు బోల్తా పడింది . ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం తోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. వేగంగా వచ్చిన బస్సు కాలువలో బోల్తా పడింది. దీంతో ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. గాయపడ్డవారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.