చిత్తూరు జిల్లాలో ఓ విచిత్ర ఘటన…ఎస్పీకి పదేపదే కాల్స్‌ చేస్తూ వేధించిన ఎఎస్సై..కారణం ఏంటంటే..?

|

Dec 18, 2020 | 2:21 PM

చిత్తూరు జిల్లాలో ఓ విచిత్ర ఘటన జరిగింది. జిల్లా ఎస్పీని ఓ వ్యక్తి అదే పనిగా వేధిస్తూ వచ్చాడు. ఆ వేధించిన వ్యక్తి కూడా ఎవరో కాదు.. ఒక ఎఎస్ఐ.

చిత్తూరు జిల్లాలో ఓ విచిత్ర ఘటన...ఎస్పీకి పదేపదే కాల్స్‌ చేస్తూ వేధించిన ఎఎస్సై..కారణం ఏంటంటే..?
Follow us on

చిత్తూరు జిల్లాలో ఓ విచిత్ర ఘటన జరిగింది. జిల్లా ఎస్పీని ఓ వ్యక్తి అదే పనిగా వేధిస్తూ వచ్చాడు. ఆ వేధించిన వ్యక్తి కూడా ఎవరో కాదు.. ఒక ఎఎస్ఐ. పదేపదే కాల్స్‌ చేస్తూ ఆ ఎఎస్‌ఐ మాట్లాడిన మాటలు కూడా విచిత్రంగానే ఉన్నాయి. రాజేంద్ర జిల్లాలోని ఓ స్టేషన్‌లో ఎఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కానీ, తాను ఓ ఛానల్‌ రిపోర్టర్‌ని అని చిత్తూరు ఎస్పీ సెంథిల్‌ కుమార్‌తో మాటలు మొదలుపెట్టాడు. పనిలో పనిగా లంచావతారుల ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఫలానా స్టేషన్‌లో ఫలానా పోలీసు ఇంత లంచం తీసుకున్నాడు. ఫలానా పని కోసం లంచం తీసుకున్నాడు.. అంటూ సమాచారం ఇచ్చేవాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ సమాచారం ఇచ్చిన రెండో రోజు  నుంచే.. సదరు వ్యక్తులపై ఏం యాక్షన్ తీసుకున్నారో చెప్పండి అంటూ ఫోన్‌ల మీద ఫోన్లు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు రాజేంద్ర.

ఒక ఎఎస్ఐ.. ఎస్పీకి పదేపదే ఫోన్ చేసి వేధిస్తుంటే.. అతన్ని గుర్తించలేదా అన్న డౌట్ రావచ్చు. కానీ.. పేరు, ప్రొఫెషన్ మార్చుకున్న రాజేంద్ర ఫోన్ కూడా మార్చాడు. ఓ చోరీ కేసులో స్వాధీనం చేసుకున్న ఫోన్‌ తీసుకుని ఆ నంబర్‌తో ఎస్పీకి ఫోన్ చేసేవాడు. ఒకటీ, రెండుసార్లు సరే అనుకున్న ఎస్పీ సెంధిల్ కుమార్‌.. అనుమానం వచ్చి ఆయా మీడియా ఛానల్స్‌ వాళ్లతో ఆరా తీశారు. అలాంటి రిపోర్టర్‌గానీ, ఆ ఇన్ఫర్మేషన్‌గానీ తాము సేకరించడం లేదని ఆయా సంస్థల నుంచి తేలడంతో విషయంపై లోతుగా దర్యాప్తు చేశారు. అప్పుడు తేలింది.. వ్యవహారం  ఎఎస్ఐ పని అని.. అతనిపేరే రాజేంద్ర అని. ఇది మేటర్. అవినీతి పరులను పట్టించాలన్న ఆయన ఉద్దేశం మంచిదైనా..జిల్లా పోలీస్ బాస్‌కు ఫోన్ చేసి ఈ తరహా వేధింపులు కరెక్ట్ కాదన్నది పలువురి మాట. చూద్దాం..అతడిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో.

 

Also Read : 

ఇతడేం భర్త… ఆవేశంలో కిరోసిన్ పోసుకున్న భార్యకు అగ్గిపెట్టె ఇచ్చాడు…ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు