ఉగ్రవాదులకు ఓవైసీ నిధులు: రాజాసింగ్ ఆరోపణలు

| Edited By:

Jun 03, 2019 | 10:16 AM

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు ఓవైసీ నిధులిస్తూ.. ఆర్థిక సహాయం చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ‘‘హైదరాబాద్ నగరంలో ఉగ్రవాదులు ఉన్నాయనడానికి కారణం ఓవైసీనే. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ పరిధిలో వివిధ దేశాలకు చెందిన ఏడు వేల మంది ముస్లింలు నివసిస్తున్నారు. వారందరికీ ఆయనే ఆశ్రయం కల్పిస్తున్నారు. ఓల్డ్ సిటీలో ఓవైసీపై వ్యతిరేకం […]

ఉగ్రవాదులకు ఓవైసీ నిధులు: రాజాసింగ్ ఆరోపణలు
Follow us on

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు ఓవైసీ నిధులిస్తూ.. ఆర్థిక సహాయం చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ‘‘హైదరాబాద్ నగరంలో ఉగ్రవాదులు ఉన్నాయనడానికి కారణం ఓవైసీనే. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ పరిధిలో వివిధ దేశాలకు చెందిన ఏడు వేల మంది ముస్లింలు నివసిస్తున్నారు. వారందరికీ ఆయనే ఆశ్రయం కల్పిస్తున్నారు. ఓల్డ్ సిటీలో ఓవైసీపై వ్యతిరేకం చాలావరకు ఉంది. 2024లో హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని బీజేపీ సొంతం చేసుకోవడం ఖాయం. ఆయన ఓటమితో ఎంఐఎం కనుమరుగవుతుంది’’ అని రాజాసింగ్ అన్నారు.

కాగా ఉగ్రవాదులకు హైదరాబాద్ సేఫ్ జోన్ అంటూ కేంద్రమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోపణలపై పలు వర్గాల నుంచి విమర్శలు రావడంతో.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనను మందలించారు. ఆ వివాదం ముగిసిందనుకున్న నేపథ్యంలో మరోసారి పుండు మీద కారం చల్లినట్లు ఓవైసీపై ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.