AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాదవ్ కేసు: మరోసారి బయటపడ్డ పాక్ వక్ర బద్ధి..!

కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ వంకర బుద్ది మరోసారి బయటపడింది. పాక్ చెరలో ఉన్న ఇండియా మాజీ సైనికాధికారి కుల్ భూషణ్ జాదవ్ ను ఉరితీసేందుకు పాక్ కుట్రలు పన్నుతోంది. అక్కడి ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షను పైకోర్టులో సవాలు చేసేందుకు జాదవ్ నిరాకరించారంటూ పాక్ చేసిన ప్రచారం వట్టిదేనని తేలింది.

జాదవ్ కేసు: మరోసారి బయటపడ్డ పాక్ వక్ర బద్ధి..!
Balaraju Goud
|

Updated on: Jul 17, 2020 | 4:08 PM

Share

కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ వంకర బుద్ది మరోసారి బయటపడింది. పాక్ చెరలో ఉన్న ఇండియా మాజీ సైనికాధికారి కుల్ భూషణ్ జాదవ్ ను ఉరితీసేందుకు పాక్ కుట్రలు పన్నుతోంది. అక్కడి ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షను పైకోర్టులో సవాలు చేసేందుకు జాదవ్ నిరాకరించారంటూ పాక్ చేసిన ప్రచారం వట్టిదేనని తేలింది. గురువారం భారత లాయర్లు పాక్ జైలులో ఉన్న జాదవ్ ను కలిశారు. కానీ, తనని మాట్లాడనీయకుండా అడుగడుగునా ఆటంకాలు, అవాంతరాలు సృష్టించారని వెల్లడైంది.

పాక్ జైలులో ఉన్న జాదవ్ ను కలిసిన లాయర్ల బృందం నుంచి నివేదిక అందిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ ధ మీడియాకు తెలిపారు. జాదవ్ న్యాయసహాయాన్ని నిరాకరించాడంటూ పాకిస్తాన్ ప్రచారం చేసిన మాట అవాస్తవమని వెల్లడైంది. అయితే, మరణ శిక్షపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు అవసరమైన సంతకాలు కూడా పెట్ట నీయకుండా పాక్ అధికారులు అనుచితంగా వ్యవహరించారని శ్రీవాస్తవ చెప్పారు.

ఇదిలావుంటే, గూఢచర్యం ఆరోపణలతో 2016లో ఇరాన్ నుంచి జాదవ్‌ను పాక్‌ ఏజెంట్లు అపహరించారు. బలూచిస్థాన్లోకి ప్రవేశించినట్లు ఆరోపణలు మోపుతూ అరెస్టు చేశారు. 2017 ఏప్రిల్‌లో పాకిస్థాన్‌ సైనిక కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. అయితే ఇరాన్‌లో ఉంటున్న జాదవ్‌ను పాక్‌ కిడ్నాప్‌ చేసిందని భారత్‌ ఆరోపించింది. పాక్‌ విధించిన మరణశిక్షను సవాల్‌ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది భారత్. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2017 మే 18న జాదవ్‌ మరణశిక్షపై స్టే విధించింది. భారత మాజీ నౌకాదళ అధికారి కుల్​భూషణ్​ జాదవ్​ను భారత దౌత్యాధికారులకు పాక్ సర్కార్ అవకాశం కల్పించింది.

ఐసీజేలో ఇండియాకు అనుకూలంగా తీర్పు రావడాన్ని పాక జీర్ణించుుకోలేకపోతోంది. కుల్ భూషణ్ జాదవ్ పై మోపబడిన ఆరోపణలు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలతో నిరోపించేవరకు ఆయన్ను ఉరితీయకూడదని ఐసీజే తేల్చి చెప్పింది. పాకిస్తాన్ ఆర్మీ కోర్టు జాదవ్ కు విధించిన మరణశిక్షపై ఇస్లామాబాద్ హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఈనెల 20తో ముగియనుంది. గడువు వృధా అయ్యేలా పాక్ అనేక కుయుక్తులు పన్నింది. తాజాగా కుల్ భూషణ్ జాదవ్ కు సంబంధించిన ఉరి శిక్షను రద్దు చేయాలని కోరుతూ క్షమాభిక్ష పై రివ్యూ పిటిషన్ వేయాలని కుల్ భూషణ్ పై ఒత్తిడి తీసుకొస్తోంది పాక్. ఈ పిటిషన్ దాఖలు చేస్తే, కుల్ భూషణ్ తప్పుచేసినట్టుగా ఒప్పుకున్నట్టే అవుతుంది. అందుకే పాక్ ఈ నాటకం ఆడుతోందని స్పష్టమవుతోంది. అయితే, కుల్ భూషణ్ మాత్రం ఈ రివ్యూ పిటిషన్ వేసేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. జాదవ్ కు న్యాయ సహాయం అందించకపోవడం వియన్నా ఒప్పందాన్ని తుంగలో తొక్కడమేనని, నాలుగ్గోడల మధ్య ఏకపక్షంగా సాగిన విచారణ ఓ ప్రహసనం అని ఐసీజే గతంలోనే పేర్కోంది.

తాజా పరిణామాలతో పాక్​ ఏర్పాటు చేసిన దౌత్య సాయం అర్థరహితంగా ఉందని, విశ్వసనీయత లోపించిందని భారత అధికారులు తెలిపారు. పాక్ అనుసరిస్తున్న విధానంపై తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ పూర్తి వ్యవహారాన్ని కుల్​భూషణ్​ జాదవ్​ కుటుంబసభ్యులకు వివరించినట్టు అధికారులు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జాదవ్​ను భారత్​కు తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నట్టు మరోమారు స్పష్టం చేసింది భారత విదేశాంగ శాఖ.

అయితే, భారత్ రెండోసారి ఐసీజేను ఆశ్రయిచండంలోనూ కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. ఐక్యరాజ్యసమితి చార్టర్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం సమ్మతిని నిర్ధారించే బాధ్యత చట్టపరంగా కాకుండా, రాజకీయపరమైన విభాగమైన UN భద్రతా మండలికి (UNSC) అప్పగించబడింది. దీని ప్రకారం ICJ నిర్ణయాలకు లోబడి ఉండవలసిన బాధ్యత ఆర్టికల్ 94 (1) UN చార్టర్‌లో పొందుపర్చబడింది. దీని ప్రకారం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైనప్పుడు యుఎన్‌ఎస్‌సి జోక్యం చేసుకుంటుంది.

అయితే జాదవ్ పట్ల పాక్ అనుసరిస్తున్న కుట్రలను బహిర్గతం చేస్తూ యుఎన్ చార్టర్ ఆర్టికల్ 94 (2) ప్రకారం అధికారం పొందిన యుఎన్ఎస్సిని భారతదేశం సంప్రదించవచ్చు. ఐసీజే తీర్పును కాదని ప్రపంచ దేశాలు వ్యవహరిస్తున్నప్పడు తీర్పుకు వ్యతిరేకంగా ఆంక్షలతో సహా బలవంతపు చర్యలకు పాల్పడినప్పడు భద్రత మండలికి అధికారం ఉంటుంది. అవసరమైతే భద్రత మండలి శాశ్వత సభ్యులు వీటో అధికారాలు కూడా ఉంటాయి. చిట్టచివరి అస్త్రంగా జాదవ్ ను పాక్ చెర నుంచి విడిపించేందుకు ఇదే సదవకాశమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏదేమైనా, కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ప్రపంచ దేశాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అందువల్ల జాదవ్ విషయంలో భారత్ యుఎన్‌ఎస్‌సిని సంప్రదించడం ప్రస్తుతం సమయంలో ఉత్తమ మార్గంగా కనిపిస్తుంది.