కరెంటుతో పాటు నీటికి.. “కేజ్రీవాల్ నజరానా”

| Edited By:

Aug 27, 2019 | 6:03 PM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ వాసులపై వరాల జల్లు కురిపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా నీటి బిల్లుల బకాయిలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి ముందు 200 వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునే వారికి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇక తాజా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం వల్ల 13 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రజలంతా తమ నల్లా […]

కరెంటుతో పాటు నీటికి.. కేజ్రీవాల్ నజరానా
Follow us on

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ వాసులపై వరాల జల్లు కురిపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా నీటి బిల్లుల బకాయిలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి ముందు 200 వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునే వారికి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇక తాజా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం వల్ల 13 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రజలంతా తమ నల్లా కనెక్షన్లకు వాటర్ మీటర్లు బిగించుకోవడం ద్వారా ప్రభుత్వానికి రూ.600 కోట్ల ఆదాయం సమకూరుతుందని సీఎం వెల్లడించారు. నవంబర్ 30లోగా అందరూ వాటర్ మీటర్లు బిగించుకోవాలనీ.. మీటర్లు బిగించుకున్న వారికే ఈ పథకం వర్తించనుందని ఆయన తెలిపారు.