లౌకికవాదమే భారత సైన్య నినాదం : జనరల్ బిపిన్ రావత్

|

Dec 28, 2019 | 3:40 PM

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు ఉదృతంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ వివాదంలో  ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ బుక్ అయ్యారు.  గురువారం రోజున టంగ్ స్లిప్పయి ఆయన చేసిన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తోంది. కాలేజీలు, వర్సిటీలతోని స్టూడెంట్స్‌ను, సామాన్య ప్రజలను తప్పదారి పట్టించి హింసకు దారిచూపడం నాయకత్వం కాదని ఆయన చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ పరిధిలోని అంశాలపై ఆర్మీ చీఫ్‌కు ఏం సంబంధం అంటూ నిలదీస్తున్నాయి. ఢిల్లీలో ఆరోగ్య […]

లౌకికవాదమే భారత సైన్య నినాదం : జనరల్ బిపిన్ రావత్
Follow us on

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు ఉదృతంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ వివాదంలో  ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ బుక్ అయ్యారు.  గురువారం రోజున టంగ్ స్లిప్పయి ఆయన చేసిన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తోంది. కాలేజీలు, వర్సిటీలతోని స్టూడెంట్స్‌ను, సామాన్య ప్రజలను తప్పదారి పట్టించి హింసకు దారిచూపడం నాయకత్వం కాదని ఆయన చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ పరిధిలోని అంశాలపై ఆర్మీ చీఫ్‌కు ఏం సంబంధం అంటూ నిలదీస్తున్నాయి.

ఢిల్లీలో ఆరోగ్య సంరక్షణపై జరిగిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచే లీడర్స్ పుట్టుకొసారని…ప్రజలను సవ్య దిశలో ముందుకు తీసుకెళ్లేవాడే సరైన నాయకుడని ఆయని ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు చేశారు. అయితే బిపిన్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ తమదైన స్టైల్లో కౌంటరిచ్చింది. ‘వైలెన్స్ దిశగా ప్రొత్సహించేవారు నాయకులు అవ్వలేరన్న ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తాను. అలాగే  మత ఘర్షణలతో హింస నెలకొల్పేలా అనుచరలను ప్రొత్సహించేవారు కూడా నాయకులు కారు..ఈ వ్యాఖ్యతో మీరూ నాతో ఏకీభవిస్తారా జనరల్ రావత్’ అంటూ  కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ఇక వామపక్ష పార్టీలు సైతం..బిపిన్ లిమిట్స్ ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశాయి.

విమర్శల ఉదృతి పెరగడంతో, రావత్ మరోసారి తన వెర్షన్‌ను వినిపించారు. భారత సాయుధ దళాలు అత్యంత లౌకిక సూత్రాలైన మానవత్వం, మర్యాద ద్వారా నడిచుకుంటాయని తేల్చి చెప్పారు. “భారత సాయుధ దళాలు మన సొంత ప్రజల మానవ హక్కుల పరిరక్షణను మాత్రమే కాకుండా,  జెనీవా ఒప్పందాల ప్రకారం విరోధులను, యుద్ధ ఖైదీలతో న్యాయంగా  వ్యవహరిస్తాయి” అని ఆయన చెప్పారు. మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో..భారత సైన్యం  క్రమశిక్షణగల సైన్యమని ఆయన స్పష్టం చేశారు.