AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aries Horoscope 2021: ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉంటుందంటే.. ఆర్థికంగా మెరుగుపడే అవకాశం ఉందా ?

మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఈ ఏడాది పొడువున శని దేవుడు పదవ స్థానంలో ఉంటాడు. ఇక ఈ సంవత్సరం ప్రారంభ దశలో శని

Aries Horoscope 2021: ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉంటుందంటే.. ఆర్థికంగా మెరుగుపడే అవకాశం ఉందా ?
Rajitha Chanti
|

Updated on: Jan 08, 2021 | 5:28 PM

Share

Aries Horoscope 2021: మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఈ ఏడాది పొడువున శని దేవుడు పదవ స్థానంలో ఉంటాడు. ఇక ఈ సంవత్సరం ప్రారంభ దశలో శని మరియు బృహస్పతి ఈ రాశిలో కలిసి ఉండడం వలన వీరికి ఆర్థిక బలాన్ని చేకురుస్తుంది. అంతేకాకుండా రెండవ మరియు ఎనిమిద స్థానంలో రాహు-కేతువు ఉండనున్నారు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 17 వరకు శుక్రుడు పదకొండవ స్థానంలోకి ప్రవేశిస్తాడు. మేష రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కెరీర్ మరియు బిజినెస్: ఈ సంవత్సరాంతం శని ఈ రాశిలో ఉండడం వలన వీరి భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందనున్నారు. కార్యాలయాలలో పనిచేసేవారు తోటి ఉద్యోగుల సహయంతో వారి ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఈ రాశిలో శుక్రుడు కూడా ఉండడంతో ఏడాది ప్రారంభంలో వ్యాపారవేత్తలకు కొంచెం కష్ణతరంగా ఉంటుంది. ఇందుకోసం వీరు సరైన మరియు కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని చేయడం ద్వారా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి తొడ్పతుంది.

ఆర్థిక- కుటుంబ జీవితం: ఈ రాశి వారు ఈ సంవత్సరం కొంచెం ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు గురు, బృహస్పతి ప్రభావంతో మీ ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. అంతేకాకుండా మీ ఆదాయం పరిమితి పెంచడానికి సరైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఇక కుటుంబ సభ్యుల మధ్య కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శని ప్రభావం మీ కుటుంబం పై ఉంటుంది. దీంతో మీకు మీ కుటుంబం నుంచి సరైన మద్ధతు లభించదు. దీంతో మీరు కొన్ని సందర్భాల్లో ఒంటరి అనే భావనతో గడిపెస్తారు.

సంసార జీవితం: ప్రేమలో ఉన్నవారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు లభించనున్నాయి. గురు, బృహస్పతి మరియు శుక్రుడు గ్రహ ప్రభావంతో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ప్రేమలో ఉన్నవారికి, దంపతులకు మంచి ఫలితాలు కలగనున్నాయి. వీరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ సమయంలో పెళ్ళి చేసుకునే వారికి వారి రాబోవు జీవితం బాగుంటుంది. అంగారకుని ప్రభావం ఏడాది ప్రారంభంలో ఉండడం వలన మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదరవుతాయి. మీ జీవిత భాగస్వామితో మనస్పార్థలు ఎదురవుతాయి.

చదువు: 2021 సంవత్సరం మేషరాశి విద్యార్థులు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో బుధుడి ప్రభావం మీ మనస్సును అధ్యయనాలలోకి తీసుకురావడానికి పని చేస్తుంది. ఇక మార్చి తరువాత పరిస్థితులతో కొంతవరకు ఒత్తిడికి లోనవుతారు. ఈ సమయంలో మీ తప్పుల వలన సంస్థ మీ చదువు విషయంలో కొంత గందరగోళానికి గురి చేస్తుంది. మొదటి నుంచే మీ కంపెనీలో మీరు అభివృద్ధి సాధించాల్సి ఉంటుంది.

ఆరోగ్యం: ఈ కొత్త ఏడాది 2021లో మేష రాశి వారి రెండవ మరియు ఎనిమిదవ స్థానాల్లో రాహు-కేతువు ఉండటంవల్ల మీరు కాస్త చిరాకుగా ఉంటారు. ఈ ఏడాది మీకు ఏదైనా బలమైన వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

పరిష్కారం: ఈ సంవత్సరం మేషరాశి వారు మంచి ఫలితాలను పొందడానికి, రోజూ ఉదయం లేవగానే సూర్య దేవుడిని చూడడం, మరియు హరతినిచ్చి నమస్కారించండి.

మూలం.. Tv9 భారత్ వర్ష్ (Tv9 Hindi)