యాదాద్రిలో పండుగ శోభ.. స్వామివారి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా ప్రత్యేక పూజలు

|

Nov 14, 2020 | 6:14 PM

యాదాద్రి శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు స్వాతినక్షత పూజలను జరిపించారు. బాలాలయంలో...

యాదాద్రిలో పండుగ శోభ.. స్వామివారి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా ప్రత్యేక పూజలు
Follow us on

Swati Nakshatra Poojas At The Yadadri : యాదాద్రి శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు స్వాతినక్షత పూజలను జరిపించారు. బాలాలయంలో ఉత్సవమూర్తులను ఆరాధిస్తూ వేదమంత్రాల మధ్య అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు.

108 కలశాలకు పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం శతఘటాభిషేక పూజలు చేశారు. స్వామివారి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా వేకువజామున బాలాలయంలో ఉత్సవమూర్తులకు అభిషేకం చేసి ప్రత్యేక హారతి నివేదించారు.

తొలుత కలశాల పూజ జరిపి నారీకేళ తీర్థంతో ఉత్సవమూర్తులను అభిషేకించారు. సుమారు రెండుగంటలపాటు స్వామివారికి అభిషేకం కొనసాగింది.