ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. శ్రీవారి భక్తులకు బంపరాఫర్.. అదేంటంటే..!
APSRTC Good News: ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. వెంకన్న దర్శనానికి వెళ్లేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది....
APSRTC Good News: ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. వెంకన్న దర్శనానికి వెళ్లేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రూ. 300 శీఘ్ర దర్శనం టికెట్లు పొందే అవకాశం కల్పించింది. ఆ టిక్కెట్ల కోసం తిరుమల బస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ సూపర్ వైజర్లు అందుబాటులో ఉండనున్నారు.
ఇదిలా ఉంటే ఏపీ ఆర్టీసీ. రోజుకు వెయ్యి శ్రీవారి దర్శనం టికెట్లను ఆర్టీసీ అందుబాటులో ఉంచనుంది. ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు శీఘ్రదర్శనం ఏర్పాటు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ ఈవో జవహర్ రెడ్డి వెల్లడించారు.
కాగా, ప్రతీ రోజూ తిరుపతికి ఏపీఎస్ఆర్టీసీ 650 బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రతీ డిపో నుంచి తిరుపతికి బస్సులు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ఇది మంచి సౌకర్యమని ఆర్టీసీ ఈవో జవహర్ రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని చదవండి:
మీ వెహికిల్‌ను అమ్మేసినా.. RC ట్రాన్స్‌ఫర్ కాలేదా.? అయితే ఇలా చేయండి..
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానంతో భార్యను కిరాతకంగా.. పక్కా ప్లాన్ ప్రకారమే..
టీమిండియాకు ప్రపంచకప్ అందించాడు.. ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్నాడు.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.?
కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా.? అయితే ఈ ఐలాండ్‌లో జాలీగా హాలీడేను ఎంజాయ్ చేయండి..!