త్వరలోనే ఆర్టీసీ గుడ్ న్యూస్..

|

Aug 08, 2020 | 5:39 PM

ఏపీఎస్‌ఆర్టీసీ(APSRTC) అంతర్రాష్ట్ర సర్వీసులను తిప్పడంపై కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటివరకు బెంగళూరుకు మాత్రమే బస్సు సర్వీసుల్ని ఆర్టీసీ నడుపుతోంది. సెప్టెంబర్ నెలలో చెన్నైకి సర్వీసుల్ని...

త్వరలోనే ఆర్టీసీ గుడ్ న్యూస్..
Follow us on

Apsrtc Bus Services Chennai Next Month : లాక్ డౌన్‌తో నిచిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు ఒక్కటొక్కటిగా ప్రారంభమవుతున్నాయి.  ఏపీఎస్‌ఆర్టీసీ(APSRTC) అంతర్రాష్ట్ర సర్వీసుల్ని తిప్పడంపై కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటివరకు బెంగళూరుకు మాత్రమే బస్సు సర్వీసుల్ని ఆర్టీసీ నడుపుతోంది. సెప్టెంబర్ నెలలో చెన్నైకి సర్వీసుల్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే తమిళనాడులో కరోనా వ్యాపి అధికంగా ఉండటంతో బస్సు సర్వీసులను నడిపేందుకు కొంత వెనుకాడుతున్నారు.

తెలుగు రాష్ట్రల మధ్య బస్సు సర్వీలు మొదలు కాలేదు. అత్యంత ఆదరణ కలిగిన రూట్‌ హైదరాబాద్‌కు సర్వీసులు తిప్పడంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 21 తర్వాత టీఎస్‌ఆర్టీసీ అధికారులతో ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు సమావేశం కానున్నారు. లాక్‌డౌన్‌ విధించిన జిల్లాల్లో ఆర్టీసీ మొన్నటివరకు సర్వీసులు నడపలేదు. ఇప్పుడు బస్సు సర్వీసుల సంఖ్య జిల్లాల్లో పెరిగింది.

ఈ నెల ప్రారంభానికి 2,018 బస్సు సర్వీసులను నడుపుతుండగా శుక్రవారం నాటికి ఈ సంఖ్య 2,363కు చేరింది. వీటిలో అత్యధికంగా ఎక్స్‌ప్రెస్‌ బస్సులు వెయ్యి వరకు నడుపుతున్నారు. శ్రావణ మాసం కావడంతో బస్సు సర్వీసులు మరింత పెంచారు. పల్లె వెలుగు సర్వీసులు రాష్ట్ర వ్యాప్తంగా 684 నడుస్తున్నాయి.