కుల, మతాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి ఫలాలు.. ఆర్యవైశ్య ఆత్మీయ అభినందన సభలో కేటీఆర్

|

Nov 27, 2020 | 3:29 PM

రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

కుల, మతాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి ఫలాలు.. ఆర్యవైశ్య ఆత్మీయ అభినందన సభలో కేటీఆర్
Follow us on

రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధిని జోడెడ్లులాగా సీఎం కేసీఆర్‌ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఆర్యవైశ్య ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు సముచిత గౌరవం కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ఎవరు ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్నారో ఆలోచించాలని కోరారు. ఆర్యవైశ్యులు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలతో పాటు ఆర్యవైశ్యులను కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆదరించిందన్న కేటీఆర్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అండగా ఉండాలని కోరారు.

ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు కేటీఆర్. రాష్ట్ర రాబడి పెరిగినప్పుడే పేదల సంక్షేమం సాధ్యం అవుతుందన్నారు. రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధించాలంటే శాంతిభద్రతలు ముఖ్యమన్నారు. గత ఆరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో విదేశీల పెట్టుబడులను తీసుకురావటంతో టీఆర్ఎస్ ప్రభుత్వ కృషీ ఎంతో ఉందన్నారు.