గవర్నర్ హరిచందన్‌ను మండలి చైర్మన్ షరీఫ్ కలిశారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని రెండుసార్లు కార్యదర్శిని ఆదేశించినా…ఫైల్ వెనక్కి పంపారని కౌన్సిల్ కార్యదర్శిపై ఫిర్యాదు చేశారు. కౌన్సిల్ చైర్మన్ ఆదేశాలను సెక్రటరీ పాటించకపోవడంపై వివాదం రేగింది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై చర్చ కొనసాగింది.