తెలంగాణ సీఎంకు టీడీపీ నేత కళా లేఖ

| Edited By:

Mar 11, 2019 | 1:29 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం మొదలైంది. ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ ముమ్మరమైంది. ఇప్పటికే డేటా చోరీ వ్యవహారంతో ఏపీ, తెలంగాణ మధ్య నిప్పు, ఉప్పులా ఉంది. ఇప్పుడు మరో ఇష్యూ టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. అదే ఎలక్షన్స్ షెడ్యూల్. తొలి జాబితాలో ఏపీని చేర్చడంపై టీడీపీ కేంద్రంగాపై గుర్రుగా ఉంది. అలాగే దీని వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందంటూ విమర్శలు చేస్తున్నారు తెలుగు తమ్ముల్లు. దీనిపై తెలంగాణ సీఎంకు […]

తెలంగాణ సీఎంకు టీడీపీ నేత కళా లేఖ
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం మొదలైంది. ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ ముమ్మరమైంది. ఇప్పటికే డేటా చోరీ వ్యవహారంతో ఏపీ, తెలంగాణ మధ్య నిప్పు, ఉప్పులా ఉంది. ఇప్పుడు మరో ఇష్యూ టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. అదే ఎలక్షన్స్ షెడ్యూల్. తొలి జాబితాలో ఏపీని చేర్చడంపై టీడీపీ కేంద్రంగాపై గుర్రుగా ఉంది. అలాగే దీని వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందంటూ విమర్శలు చేస్తున్నారు తెలుగు తమ్ముల్లు. దీనిపై తెలంగాణ సీఎంకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. సేవామిత్ర యాప్, డేటాచోరి కేసు వ్యవహారంతో పాటు ఎన్నికల షెడ్యూల్ ప్రకటనపై కేసీఆర్‌ను విమర్శిస్తూ లెటర్ రాశారు కళా.

జగన్‌ను నమ్మి ప్రజలు ఓటేస్తారని.. అప్పుడు ఏపీపై పెత్తనం చేయవచ్చని కేసీఆర్ పగటి కలలు కంటున్నారంటూ లెటర్ రాశారు కళా. నేరుగా టీడీపీని ఎదుర్కోలేక జగన్‌ను అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని ఏలాలని కేసీఆర్ చూస్తున్నారని.. ఇది ఎంతమాత్రం సాధ్యం కాదన్నారు కళా. లోటస్ పాండ్ కేంద్రంగా మీరు మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నారంటూ కేసీఆర్‌ను విమర్శిస్తూ లేఖ రాశారు కళా.