ఆంధ్రాలో ఐసిస్ కలకలం

|

Jan 14, 2020 | 4:43 PM

ఏపీలో ఐసిస్ తీవ్రవాదులకు సంబంధించిన సమాచారం కర్నాటక నుంచి రావడంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఐసిస్ అనుమానితులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో ఒకరి మొబైల్ ఫోన్ నుంచి ఐసిస్ ఏజెంట్లకు కాల్స్ వెళ్ళి నట్లు తేలడంతో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే.. జనవరి 12వ తేదీ అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లాలో లారీలలో వెళుతున్న నలుగురు వ్యక్తులను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచిలిలో పట్టుబడిన ఈ నలుగురు అనుమానితులకు సంబంధించి ప్రాధమిక […]

ఆంధ్రాలో ఐసిస్ కలకలం
Follow us on

ఏపీలో ఐసిస్ తీవ్రవాదులకు సంబంధించిన సమాచారం కర్నాటక నుంచి రావడంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఐసిస్ అనుమానితులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో ఒకరి మొబైల్ ఫోన్ నుంచి ఐసిస్ ఏజెంట్లకు కాల్స్ వెళ్ళి నట్లు తేలడంతో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే..

జనవరి 12వ తేదీ అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లాలో లారీలలో వెళుతున్న నలుగురు వ్యక్తులను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచిలిలో పట్టుబడిన ఈ నలుగురు అనుమానితులకు సంబంధించి ప్రాధమిక విచారణను పోలీసులు పూర్తి చేశారు. ఈ నలుగురిలో ఇద్దరు లారీ డ్రైవర్లు, మరో ఇద్దరు క్లీనర్లు. లారీ డ్రైవర్ అష్రఫ్ మొబైల్ నుంచి ఐసిస్ ఏజెంట్ సలీం ఫ్యామిలీకి ఫోన్ కాల్ వెళ్ళినట్లు తేలడంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు.

సలీం కాల్ చేసినట్టు నిఘావర్గాలకు అనుమానం రావడంతో ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు వీరిని ట్రాక్ చేశారు. ఓ వాహనంలో ఐసిస్ ఏజెంట్ సలీం ప్రయాణిస్తున్నట్టు అనుమానించారు కర్నాటక పోలీసులు. వారిచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఏపీ పోలీసులు… రెండు లారీలను వెంబడించారు. బెంగళూరు నుంచి టొమాటో లోడ్‌తో వీరు భద్రక్‌కు పయనిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి దగ్గర రెండు లారీలలో జర్నీ చేస్తున్న ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులతోపాటు నిఘా వర్గాలు ఈ నలుగురిని విచారించి పలు అంశాలను కనుగొన్నాయి. లారీ డ్రైవర్ అష్రఫ్ మొబైల్ నుంచి 2 సార్లు ఐసిస్ ఏజెంట్ సలీంకు కాల్ చేసినట్టు గుర్తించారు. బెంగుళూర్ వెళ్తున్న అష్రఫ్‌కు బస్సులో పరిచయమైన ఓ వ్యక్తి అర్జెంట్ కాల్ చేసుకోవాలంటూ మొబైల్ తీసుకున్నాడని అష్రఫ్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. బస్సులో ఒకసారి, బస్సు దిగిన తర్వాత బెంగళూరు మార్కెట్‌లో మరోసారి తన మొబైల్ నుంచి ఎవరికో కాల్ చేసుకున్నాడని అష్రఫ్ పోలీసులకు చెప్పాడు.

అయితే అష్రఫ్ మొబైల్‌తో కాల్స్ చేసింది.. ఐసిస్ ఏజెంట్ సలీమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. విశాఖకు వచ్చిన కర్నాటక పోలీసులు, నిఘా వర్గాలు ఈ నలుగురిని విచారించాయి. ఫోన్ వాడుకోవడం తప్ప.. ఈ నలుగురికి ఐసిస్ ఏజెంట్ సలీంకు సంబంధం లేదని ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు. దాంతో వారిని షరతులతో కూడా నోటీసు ఇచ్చి పంపించేశారు.