ఫిబ్రవరిలోగా అంతర్వేదిలో కొత్త రథం: వెల్లంపల్లి

|

Sep 14, 2020 | 6:50 PM

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో దగ్ధమైన రథం స్థానంలో కొత్త రథాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా నిర్మిస్తామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

ఫిబ్రవరిలోగా అంతర్వేదిలో కొత్త రథం: వెల్లంపల్లి
Follow us on

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో దగ్ధమైన రథం స్థానంలో కొత్త రథాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా నిర్మిస్తామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. స్వామివారి కల్యాణోత్సవాలకు ముందే రథం సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రథం ఆకృతిలో ఎలాంటి మార్పులు లేకుండా గతంలోలాగానే నిర్మాణంలోనే నిర్మిస్తామని మంత్రి వివరించారు. కొత్త రథం నిర్మాణానికి రూ.95 లక్షలు ఖర్చవుతుందన్న అంచనా వేశామన్నారు. శిఖరంతో కలిపి మొత్తం 41 అడుగులు ఎత్తు వచ్చేలా కొత్త రథం డిజైన్ రెడీ అయినట్లు అధికారులు తెలిపారని మంత్రి ట్విట్ చేశారు. రథం నిలిపే షెడ్డును కూడా పునరుద్ధరించాలని వెల్లంపల్లి అధికారులకు సూచించారు. దీనికి ఇనుప షట్టర్ అమర్చాలని నిర్ణయించామని వివరించారు. దీంతో లోపలికి ఎవరూ ప్రవేశించే అవకాశం ఉండదని చెప్పారు.

మరోవైపు రథం దగ్ధంపై జగన్ సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఘటనపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలు సీబీఐ విచారణ కోరడంతో.. ఏపీ సర్కార్ ఆ దిశగా నిర్ణయం తీసుకుంది.

Also Read :

విషాదం : చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్

వివేకా హత్య కేసు లేటెస్ట్ అప్డేట్

ఎస్పీ బాలసుబ్రమణ్యం హెల్త్ లేటెస్ట్ అప్డేట్