హైకోర్టు తీర్పు పవర్ ప్రాజెక్టు విషయంలోనే: మంత్రి అనిల్

| Edited By:

Aug 23, 2019 | 2:58 PM

ఏపీలో చేపట్టిన ప్రాజెక్టుల్లో అవినీతి, దోపిడీని అరికట్టేందుకే సీఎం రివర్స్‌ టెండరింగ్‌కి వెళ్లినట్టు చెప్పారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. పోలవరంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామన్నారు. ప్రాజెక్టు పనుల్లో ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే రివర్స్ టెండరింగ్‌కు వెళ్ళినట్టు వివరించారు. హైకోర్టు పవర్‌ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రమే తీర్పు ఇచ్చిందని.. నిర్మాణ పనులపై కాదని ఆయన తెలిపారు. కోర్టు తీర్పు నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపై అడ్వకేట్‌ జనరల్‌తో చర్చిస్తున్నామని అనిల్ చెప్పారు. […]

హైకోర్టు తీర్పు పవర్ ప్రాజెక్టు విషయంలోనే: మంత్రి అనిల్
Follow us on

ఏపీలో చేపట్టిన ప్రాజెక్టుల్లో అవినీతి, దోపిడీని అరికట్టేందుకే సీఎం రివర్స్‌ టెండరింగ్‌కి వెళ్లినట్టు చెప్పారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. పోలవరంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామన్నారు. ప్రాజెక్టు పనుల్లో ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే రివర్స్ టెండరింగ్‌కు వెళ్ళినట్టు వివరించారు.

హైకోర్టు పవర్‌ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రమే తీర్పు ఇచ్చిందని.. నిర్మాణ పనులపై కాదని ఆయన తెలిపారు. కోర్టు తీర్పు నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపై అడ్వకేట్‌ జనరల్‌తో చర్చిస్తున్నామని అనిల్ చెప్పారు. తమ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు. ఆ భయంతోనే పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోతున్నాయంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి. ఈ ప్రచారమంతా అవాస్తమని మంత్రి కొట్టిపారేశారు. తమ ప్రభుత్వ విధానాలు తప్పని హైకోర్టు ఎక్కడా చెప్పలేదని మంత్రి అనిల్ వివరించారు.