Anil Kumar Yadav: అచ్చెన్నాయుడువి మతిలేని మాటలు.. 2024లో గల్లంతవడం ఖాయం : అనిల్‌ కుమార్‌ యాదవ్‌

టీడీపీ నేత అచ్చెన్నాయుడు మతిలేని మాటలు మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. 30 ఏళ్లుగా బీసీలను టీడీపీ మోసం చేస్తూనే వస్తోందని చెప్పుకొచ్చిన మంత్రి...

Anil Kumar Yadav: అచ్చెన్నాయుడువి మతిలేని మాటలు.. 2024లో గల్లంతవడం ఖాయం  :  అనిల్‌ కుమార్‌ యాదవ్‌
AP Minister Anil Kumar Yadav

Updated on: Jul 23, 2021 | 6:54 PM

Anil Kumar Yadav : టీడీపీ నేత అచ్చెన్నాయుడు మతిలేని మాటలు మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. 30 ఏళ్లుగా బీసీలను టీడీపీ మోసం చేస్తూనే వస్తోందని చెప్పుకొచ్చిన మంత్రి.. బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని చెప్పారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని అనిల్ జోస్యం చెప్పారు.

తాడేపల్లిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన మంత్రి.. అచ్చెన్నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.  ఆంధ్రప్రదేశ్‌లో బడుగు బలహీన వర్గాలకు ఎవరూ ఇవ్వని ప్రాధాన్యం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇస్తున్నారన్నారని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. అర్ధ శాతం రాజకీయ పదవులు బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ కేటాయించారని వివరించారు.

ఒకేసారి రాష్ట్రంలో 1,30,000 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కూడా జగన్ ప్రభుత్వానిదేనని అనిల్ అన్నారు. సీఎం వైయ‌స్ జగన్ వెంటే బీసీలు ఉండటాన్ని జీర్ణించుకోలేని అచ్చెన్నాయుడు విమర్శలు చేయటం సిగ్గుచేటని మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు అన్యాయం చేస్తున్నారంటూ ఇటీవల అచ్చెన్న చేసిన వ్యాఖ్యలకు అనిల్ ఇవాళ పై విధంగా కౌంటర్ ఇచ్చారు.

Read also:  Tirumala : గోసంర‌క్షణ కోసం కొంగొత్తగా ‘గోవిందుని గోప‌థ‌కం’ ప్రాజెక్టు : టిటిడి ఈవో కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి