పీజీ కోర్సు ఫీజుల తగ్గింపు.. ప్రవేశాలు రద్దు..
ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల నిర్వహణ సంఘం ప్రకటించిన విషయం విదితమే.

ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల నిర్వహణ సంఘం ప్రకటించిన విషయం విదితమే. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రైవేటు కళాశాలలకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ జారీ చేసిన సర్క్యులర్‌పై ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల నిర్వహణ సంఘం స్పందించింది. ఈ మేరకు కళాశాలల సంఘం ఓ ప్రకటనలో.. పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల ఫీజుల నిర్ధారణ శాస్త్రీయంగా లేదని.. నిర్ధారించే సమయంలో తమ అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని సంఘం పేర్కొంది.
వివరాల్లోకెళితే.. గత మూడు నెలలుగా ఆదాయం బాగా తగ్గిందని.. సిబ్బంది జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి ఆస్పత్రులు చేరాయని తెలిపింది. ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఉన్న టీచింగ్ ఆస్పత్రులను కరోనా ఆస్పత్రులుగా మార్చారని.. దీంతో ఇతర ఆరోగ్య సమస్యలున్న వారిని చూసే అవకాశం లేకుండా పోయిందని పేర్కొంది. ఫీజుల కంటే మెడికోలకు ఇచ్చే స్టైఫండ్ మొత్తమే ఎక్కువగా ఉందని, పీజీ కోర్సుల ఫీజులు 70 శాతం తగ్గించారని తెలిపింది. ఇలాంటి సమయంలో బోధనా ఆస్పత్రులు నిర్వహించలేమని.. అందుకే పీజీ కోర్సుల్లో ప్రవేశాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రైవేట్ కళాశాలల నిర్వహణ సంఘం స్పష్టం చేసింది.
Also Read: కరోనాపై విజయం.. యాక్టివ్ కేసులు లేని దేశంగా..



