ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. గ్రేడింగ్ రద్దు.. ఇక మార్కులే!

| Edited By: Srinu

Jan 28, 2020 | 1:42 PM

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్‌లో ఉన్న గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసింది. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. ఈ ఏడాది నుంచి ఇంతకు ముందు తరహాలోనే మార్కులు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రేడింగ్ విధానం ద్వారా విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లు రామకృష్ణ తెలిపారు. అలాగే ఉన్నత విద్యా సంస్థల ప్రవేశాల్లో కూడా ఇబ్బందులు వస్తున్నాయని, అందుకే గ్రేడింగ్ విధానాన్ని రద్దు […]

ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. గ్రేడింగ్ రద్దు.. ఇక మార్కులే!
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్‌లో ఉన్న గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసింది. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. ఈ ఏడాది నుంచి ఇంతకు ముందు తరహాలోనే మార్కులు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రేడింగ్ విధానం ద్వారా విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లు రామకృష్ణ తెలిపారు. అలాగే ఉన్నత విద్యా సంస్థల ప్రవేశాల్లో కూడా ఇబ్బందులు వస్తున్నాయని, అందుకే గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా.. ఇంటర్ ప్రయోగ పరీక్షల హాల్ టికెట్ల కోసం www.bie.ap.gov.in linkని డౌన్‌లోడ్ చేసుకోవాలని రామకృష్ణ సూచించారు.