Maskey Kavacham Program: కరోనాను కట్టడి చేయడమే ధ్యేయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని “మాస్కే కవచం” పేరిట నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలన్నారు. విజయవాడలోని ఆర్ &బి బిల్డింగ్ కోవిడ్ కమాండ్ సెంటర్ లో ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. కోవిడ్ మహమ్మారిని అంతం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం అని చెప్పుకొచ్చారు.
Also Read: కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!
ఉపయోగించిన మాస్కుల్ని మూడు రోజుల పాటు మూసిన కవర్లో ఉంచి పారేయాలని సూచించారు. ఇలా చేస్తే ఒకరి నుండి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందదని తెలిపారు. మీ ఇళ్లల్లో 60 ఏళ్లు పైబడిన వారిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. అంతేకాకుండా రోడ్లపైకి వెళ్ళినప్పుడు యువత తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
Also Read:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!
గుడ్ న్యూస్.. ఒక్క ఓటీపీతో ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కి..