ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం

| Edited By:

Aug 09, 2019 | 8:25 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయానికి తెరతీశారు . పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీరింగ్ పనులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గత ఏప్రిల్ 1లోపు మంజూరు చేసిన పనుల విషయమై ఏపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా విశాఖపట్నంలో 59 పనులను ప్రభుత్వం నిలిపివేసింది. ఇంకా పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో 25 శాతంలోపే పూర్తయిన పనులను కూడా సమీక్షించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. […]

ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయానికి తెరతీశారు . పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీరింగ్ పనులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గత ఏప్రిల్ 1లోపు మంజూరు చేసిన పనుల విషయమై ఏపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.

అత్యధికంగా విశాఖపట్నంలో 59 పనులను ప్రభుత్వం నిలిపివేసింది. ఇంకా పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో 25 శాతంలోపే పూర్తయిన పనులను కూడా సమీక్షించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో విజయనగరం, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో పనులు నిలిచిపోయాయి. తూర్పు గోదావరిలో 44 పనులను నిలిపివేసింది. పనుల విలువ పరంగా చూస్తే కృష్ణా జిల్లా రెండో స్థానంలో ఉంది. మొత్తం రూ.56.84 కోట్ల విలువయ్యే 144 పనులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.