ఏపీలో జీతాల చెల్లింపుకు లైన్ క్లియర్.. బిల్లుకు గవర్నర్ ఆమోదం..

ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనమండలిలో ఆమోదముద్ర పడకపోవడంతో... ఏపీలోని ప్రభుత్వోద్యోగులకు జీతాలు పడని సంగతి విదితమే. అయితే, ఈ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

ఏపీలో జీతాల చెల్లింపుకు లైన్ క్లియర్.. బిల్లుకు గవర్నర్ ఆమోదం..

Edited By:

Updated on: Jul 03, 2020 | 5:55 AM

AP Governor approves monetary exchange bill: ఏపీలో ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనమండలిలో ఆమోదముద్ర పడకపోవడంతో… ఏపీలోని ప్రభుత్వోద్యోగులకు జీతాలు పడని సంగతి విదితమే. అయితే, ఈ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. శాసనమండలి సమావేశాలు ముగిసిన తర్వాత… 14 రోజుల గడువు ముగియడంతో బిల్లును ఈరోజు గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించింది. ఆయన ఆమోదం తెలపడంతో ఉద్యోగుల జీతాలు, ఇతర ఆర్థిక బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వానికి అవరోధాలు తొలిగాయి. శుక్రవారం నుంచి ప్రభుత్వ చెల్లింపులు యథావిధిగా కొనసాగనున్నాయి.

Also Read: అసోంలో వరద బీభత్సం.. 33కు పెరిగిన మృతుల సంఖ్య..