కరోనా ఎఫెక్ట్: మెరుగైన సేవలకోసం.. 104 కాల్‌ సెంటర్  

కరోనా సంక్షోభ సమయంలో మెరుగైన సేవలు అందించేలా 104 కాల్‌ సెంటర్‌ ను వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పరీక్షలు చేయించడం దగ్గర నుంచి ఆస్పత్రిలో బెడ్ల కేటాయింపు వరకు అన్ని సేవలను పొందడానికి ఈ వ్యవస్థ

కరోనా ఎఫెక్ట్: మెరుగైన సేవలకోసం.. 104 కాల్‌ సెంటర్  

Edited By:

Updated on: Aug 01, 2020 | 2:27 PM

కరోనా సంక్షోభ సమయంలో మెరుగైన సేవలు అందించేలా 104 కాల్‌ సెంటర్‌ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పరీక్షలు చేయించడం దగ్గర నుంచి ఆస్పత్రిలో బెడ్ల కేటాయింపు వరకు అన్ని సేవలను పొందడానికి ఈ వ్యవస్థ వీలు కల్పిస్తుంది. కాల్‌ చేసిన వ్యక్తికి సంబంధించిన సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ డిజిటల్‌ పద్ధతుల్లో అధికారులు పర్యవేక్షించేలా ప్రోగ్రాం రూపొందించారు. సమస్య పరిష్కారమైన తర్వాతే ప్రోగ్రాం నుంచి ఆ సమస్య తొలగించబడుతుంది.

కరోనా మహమ్మారి కట్టడికోసం.. సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఈ చర్యలు తీసుకుంది. 104కు  కాల్‌ చేయగానే కోవిడ్‌ పరీక్ష ఎక్కడ చేయించుకోవాలి? టెస్ట్‌ సెంటర్‌ ఎక్కడుంది? దగ్గరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎక్కడుంది? సంబంధిత ప్రాంతంలో ఏఎన్‌ఎం ఎవరు? సంబంధిత డాక్టర్‌ సమాచారం ఏంటి? తదితర సమాచారాన్ని పొందవచ్చు. వీటితోపాటు ఆస్పత్రుల్లో బెడ్లు, వాటి భర్తీ, ఉన్న ఖాళీలపైన కూడా ఎప్పటికప్పుడు వివరాలను అప్‌డేట్‌ చేస్తూ.. 104తో పాటు, కోవిడ్‌ ఆస్పత్రుల వివరాలను అందుబాటులో ఉంచుతున్నారు.