సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్.. ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం.!

|

Aug 31, 2020 | 11:17 AM

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్.. ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం.!
Follow us on

Online Rummy Ban: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మద్యంపై ఉక్కుపాదం మోపిన సర్కార్.. ఆన్లైన్ రమ్మీపైనా ఇదే తరహాలో ముందుకు వెళ్లాలని భావిస్తోందట. ఇటీవల రమ్మీ మోసాలు బాగా పెరిగిపోవడంతో పాటు సైబర్ క్రైం నేరాలు కూడా ఎక్కువైపోయాయి.

ముఖ్యంగా చిన్న పిల్లలు, యువత ఆన్లైన్ రమ్మీకి ఎక్కువగా బానిసవుతున్నారు. వీటి వల్ల ఏటా వందల కోట్ల రూపాయలు హంఫట్ అయిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఆన్లైన్ రమ్మీని నిషేధించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. కాగా, ఈ మధ్యకాలంలో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఘటనలు అన్ని చోట్లా చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది బాధితులు తమ డబ్బును పోగొట్టుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఏపీ ప్రభుత్వం దీనిపై ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఓ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Also Read: 

‘వైఎస్సార్ బీమా’ పధకం విధి విధానాలు.. జిల్లాల వారీగా ఫోన్ నెంబర్లు.!

ఏపీ: 1036 గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా.!