ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలోనే ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.! వివరాలివే..

AP Government Good News: ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించనుంది. త్వరలోనే‌ గత డీఎస్సీలో మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు

ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలోనే ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.! వివరాలివే..

Updated on: Dec 25, 2020 | 4:01 PM

AP Government Good News: ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించనుంది. త్వరలోనే‌ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇప్పటికే టీచర్ పోస్టుల భర్తీకి కసరత్తులు ప్రారంభించిన విద్యాశాఖ.. ప్రస్తుతం జరుగుతున్న బదిలీ ప్రక్రియ అనంతరం రిక్రూట్‌మెంట్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.

మొదటిగా డీఎస్సీ-2018లో మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ యోచిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో 403 బ్యాక్ లాగ్ పోస్టులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి కోసం లిమిటెడ్ డీఎస్సీని నిర్వహించనున్నారు. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్ధులు లేకపోతే జనరల్ కేటగిరి కింద రెగ్యులర్ డీఎస్సీ(15 వేల పోస్టులకు పైగా)ని భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే దాని కంటే ముందు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో ఈసారి TET సిలబస్‌లో మార్పులు జరగనున్నాయి. టెట్ అనంతరం డీఎస్సీ నిర్వహించే అవకాశాలున్నాయి. కాగా, సంక్షేమ స్కూళ్లలో 182 ఖాళీలు ఉండగా.. జిల్లాల వారీగా ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్‌, మున్సిపల్‌ స్కూళ్లలో 221 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:

Bigg Boss 4: మెహబూబ్ సైగలపై స్పందించిన అభిజిత్.. ‘స్టార్ మా’ తేల్చాలంటూ ఆసక్తికర కామెంట్స్.!

కేంద్రం కీలక నిర్ణయం.. జనవరి 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరి.!

ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం దుకాణాలు, బార్లపై నిషేధం లేదంటూ..!

షాకింగ్ న్యూస్: కరోనా లక్షణాలు లేవని ఆఫీస్‌కు వచ్చిన ఉద్యోగి.. ఏడుగురు మృతి, 300 మంది క్వారంటైన్.!