ఆరోగ్యశ్రీ వైద్యసేవలపై ప్రత్యేక కమిటీ!

| Edited By:

Jun 14, 2019 | 7:25 AM

దివంగత సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ప్రజల ఆదరణను చూరగొంది. వేల మంది పేద ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. అయితే ఇప్పుడు డా.వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ నియమించింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ విశ్రాంత కార్యదర్శి కె. సుజాతరావు అధ్యక్షతన 9 మంది వైద్య నిపుణుల కమిటీ వైద్యసేవల నాణ్యతపై అధ్యయనం చేయనుంది. వైద్య ఆరోగ్య శాఖ విభాగాధిపతులు, ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి, […]

ఆరోగ్యశ్రీ వైద్యసేవలపై ప్రత్యేక కమిటీ!
Follow us on

దివంగత సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ప్రజల ఆదరణను చూరగొంది. వేల మంది పేద ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. అయితే ఇప్పుడు డా.వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ నియమించింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ విశ్రాంత కార్యదర్శి కె. సుజాతరావు అధ్యక్షతన 9 మంది వైద్య నిపుణుల కమిటీ వైద్యసేవల నాణ్యతపై అధ్యయనం చేయనుంది. వైద్య ఆరోగ్య శాఖ విభాగాధిపతులు, ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి, వైద్యరంగ నిపుణుల ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ప్రజలకు అందించే ఉచిత వైద్య సేవలపై ఈ కమిటీ అధ్యయనం చేసి..ప్రభుత్వానికి నివేదించనుంది.